Ashwatthama – Amitabh : ‘కల్కి’ సెట్లో ‘అశ్వత్థామ’గా అమితాబ్ విగ్రహం చూశారా? ఎంత భారీగా ఉందో..

తాజాగా కల్కి సెట్స్ నుంచి అశ్వత్థామ పాత్ర భారీ విగ్రహం ఫోటో వైరల్ అవుతుంది.

Ashwatthama – Amitabh : ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఇప్పటికే 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలోని ప్రతి పాత్రని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ప్రభాస్ భైరవ పాత్రతో పాటు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్ర కూడా ఎక్కువగానే ఉంది సినిమాలో. మన పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులలో ఒకరైన అశ్వత్థామ పాత్రని కల్కి సినిమాలో అద్భుతంగా చూపించారు. అమితాబ్ బచ్చన్ కూడా ఆ పాత్రలో ఒదిగిపోయారు.

Also Read : Chiranjeevi : చిరంజీవి ఇంట్లో కీరవాణి పాటల కచేరి.. పాతరోజులు గుర్తొచ్చాయంటూ స్పెషల్ వీడియో షేర్ చేసిన మెగాస్టార్..

ఇక ఈ సినిమా కోసం ఎక్కువగా స్పెషల్ సెట్స్ వేసి, గ్రాఫిక్స్ తోనే షూట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కల్కి సెట్స్ నుంచి అశ్వత్థామ పాత్ర భారీ విగ్రహం ఫోటో వైరల్ అవుతుంది. బాలీవుడ్ సీనియర్ పాపులర్ సినిమా జర్నలిస్ట్ అనుపమ చోప్రా తాజాగా కల్కి సెట్స్ కి వెళ్ళింది. అక్కడ దాదాపు 10 అడుగుల పైన ఉన్న అశ్వత్థామ పాత్ర విగ్రహంతో ఫోటో దిగి అమితాబ్ సర్ క్యారెక్టర్ అంటూ స్పెషల్ పోస్ట్ చేసింది. దీంతో ఈ విగ్రహం వైరల్ అవుతుంది.

అమితాబ్ పాత్ర రిఫరెన్స్ కోసం, కొన్ని గ్రాఫిక్ షాట్స్ కోసం ఇంత భారీ అశ్వత్థామ పాత్ర విగ్రహం తయారుచేసినట్టు తెలుస్తుంది. దీంతో ఈ ఫోటో చూసి ఇదేంటి మరీ ఇంత ఎత్తు ఉంది విగ్రహం, ఆ విగ్రహం ముందు అనుపమ చిన్న పిల్లలా కనిపిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో కూడా అన్ని పాత్రల కంటే అశ్వత్థామ పాత్ర చాలా ఎత్తు ఉంటుంది. మన పురాణాల ప్రకారం అప్పట్లో మనుషులు 7, 8 అడుగులపైనే ఉండేవాళ్ళు. దాదాపు 10 అడుగుల మనుషులు కూడా ఉండేవాళ్ళు. ఆ రిఫరెన్స్ తోనే అశ్వత్థామ పాత్రని చాలా హైట్ గా చూపించారు. ఆ పాత్రకి తగ్గట్టు ఇప్పుడు ఈ భారీ విగ్రహాన్ని కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు.

ట్రెండింగ్ వార్తలు