IIIT Basara Students Protests : బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం

బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం రేపుతోంది. పోలీసులు, అధికారులు తమను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో విడుదల చేశాడు.

IIIT Basara Students Protests : బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం రేపుతోంది. పోలీసులు, అధికారులు తమను బెదిరిస్తున్నారని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో విడుదల చేశాడు. రేపు నిరసన ఆపకపోతే వెయ్యి మంది పోలీసులను దింపుతామని బెదిరిస్తున్నారని విద్యార్థి వాపోయాడు. ఇవాళ రాత్రి క్యాంపస్ లో వాటర్, పవర్, ఫుడ్ పూర్తిగా ఆపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పాడు. తమను బెదిరిస్తున్నారు అంటూ విద్యార్థి విడుదల చేసిన ఆడియో కలకలం రేపుతోంది.

నిరసన బాట పట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బాసర ట్రిపుల్ ఐటీ ఏవోపై వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Basara IIIT : బాసర ట్రిపుల్‌ ఐటీలో హైటెన్షన్‌..చిచ్చు రేపిన మంత్రి సబితా సిల్లీ డిమాండ్స్‌ కామెంట్స్‌

అటు.. విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చల్లో గందరగోళం ఏర్పడింది. చర్చలు సఫలం అయ్యాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొనగా, చర్చలు విఫలం అయ్యాయని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రేపు కూడా ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించారు. బాసర ట్రిపుల్ ఐటీకి సీఎం కేసీఆర్ రావాలని పట్టుబడుతున్నారు.(IIIT Basara Students Protests)

విద్యార్థుల నిరసనల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి, ఆందోళన విరమణ కోసం వారిని కొందరు హెచ్ఓడీలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళన విరమించుకుంటే భోజనం పెట్టం అని హెచ్చరించిన హెచ్ఓడీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.

Basara IIIT Students: రెండో దశ చర్చలు విఫలం.. సీఎం కేసీఆర్ రావాల్సిందేనంటూ విద్యార్థుల డిమాండ్..

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళనలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి స్పందించారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరుతూ విద్యార్థులకు లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ‘‘ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారనే నా ఆవేదన. బాసర ట్రిపుల్‌ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దు. విద్యార్థుల ఆందోళనలు చూస్తే మంత్రిగా, ఓ అమ్మగా బాధేస్తోంది. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్‌ని నియమించాం. ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ వెంకటరమణను ప్రభుత్వం మీ వద్దకు పంపింది. ఇది మీ ప్రభుత్వం దయచేసి చర్చించండి’’ అని లేఖలో కోరారు మంత్రి సబిత.

కాగా, నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఐదో రోజుకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ ఇస్తున్న హామీని తోసిపుచ్చారు. ఆదివారం కూడా ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం చేశారు. మరోవైపు క్యాంపస్ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. నిజామాబాద్-భైంసా రూట్లలో పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

విద్యాలయంలో సమస్యల పరిష్కారానికి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 12 డిమాండ్లు తీర్చాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వీటిలో కొన్నింటికీ ప్రభుత్వం ఓకే చెబుతున్నా విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ విద్యాలయాన్ని సందర్శించి తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే నాలుగో రోజు ప్రతిపక్షాల నాయకులు విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళ్లగా.. విద్యాలయంలోని విద్యార్థులను కలవనీయకుండా అరెస్టు చేసి బయటికి తీసుకొచ్చి విడిచిపెట్టారు.

ట్రెండింగ్ వార్తలు