Android Users Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మీ పర్సనల్ డేటా డేంజర్‌లో.. ఈ ఫేక్ యాప్ వెంటనే డిలీట్ చేసేయండి..!

Android Users Alert : హ్యాకర్లు 'సేఫ్‌చాట్' అనే ఫేక్ ఆండ్రాయిడ్ యాప్‌ను ఉపయోగించి ఫోన్ డివైజ్‌లను హ్యాక్ చేస్తున్నారు. యూజర్ల వాట్సాప్ డేటా, ఇతర సున్నితమైన డేటాను దొంగిలించే రిస్క్ ఉంది.

Android Users Alert : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. భారత మార్కెట్లో కూడా మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. వాట్సాప్ సైబర్ ప్రపంచంలో హ్యాకర్లకు ప్రధాన లక్ష్యంగా మారింది. స్కామ్‌ల నుంచి సైబర్ దాడుల వరకు వాట్సాప్ యూజర్ల డేటాను తరచుగా హ్యాకర్లు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు.

స్పైవేర్ మాల్వేర్‌తో డివైజ్‌లను ఇన్‌ఫెక్ట్ చేయడానికి హ్యాకర్లు ‘సేఫ్‌చాట్’ అనే ఫేక్ ఆండ్రాయిడ్ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్లాట్‌ఫారమ్ మరోసారి రాడార్‌లో ఉంది. ఈ డేంజరస్ సాఫ్ట్‌వేర్ వాట్సాప్ యూజర్ల డేటాను దొంగిలించడమే కాకుండా వారి ఫోన్‌ల నుంచి కాల్ లాగ్‌లు, టెక్స్ట్‌లు, GPS లొకేషన్లతో సహా ఇతర సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉంది.

స్పైవేర్ టెలిగ్రామ్, సిగ్నల్, వాట్సాప్, వైబర్, ఫేస్‌బుక్ మెసెంజర్ వంటి కమ్యూనికేషన్ యాప్‌లను లక్ష్యంగా చేసుకునే ’Coverlm’ రూపాంతరంగా అనుమానిస్తున్నారు. CYFIRMA పరిశోధకుల ప్రకారం.. ‘Bahamut’ అనే భారతీయ APT హ్యాకింగ్ గ్రూప్ ఈ మాల్వేర్ క్యాంపెయిన్‌కు బాధ్యత వహిస్తుంది. ప్రధానంగా వాట్సాప్‌లోని స్పియర్-ఫిషింగ్ మెసేజ్‌ల ద్వారా నిర్వహించవచ్చు.

హానికరమైన పేలోడ్‌లను నేరుగా బాధితులకు పంపిణీ చేస్తుంది. బహమట్ భారత్, దక్షిణాసియాలోని యూజర్లను లక్ష్యంగా చేసుకుంటుంది. CYFIRMA విశ్లేషకుల్లో Bahamut పద్ధతులు మరో భారతీయ ‘DoNot APT’ (APT-C-35) ఉపయోగించే పద్ధతులను పోలి ఉన్నాయని కనుగొన్నారు. DoNot APT గతంలో స్పైవేర్‌గా పనిచేసే ఫేక్ చాట్ యాప్‌లతో (Google Play) స్టోర్‌లో ఉందని తెలిపింది.

Read Also : Redmi 12 Series Launch : సరసమైన ధరకే రెడ్‌మి 12 సిరీస్ ఫోన్లు.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. వెంటనే కొనేసుకోండి..!

Safechat యాప్.. మీ డేటాను దొంగిలిస్తోంది :
సైబర్ దాడికి సంబంధించిన సోషల్ ఇంజినీరింగ్ కోణాన్ని CYFIRMA ప్రత్యేకంగా వెల్లడించనప్పటికీ, సురక్షితమైన కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌కు దారితీస్తుందని నమ్మి చాట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని బాధితులు విశ్వసిస్తున్నారని స్పష్టం చేసింది. ఈ యాప్ యూజర్ ఇంటర్‌ఫేస్ యూజర్లను నమ్మించేలా ఉంటుంది. ఆ యాప్ డమ్మీ అని బాధితులు గ్రహించేలోపు మాల్వేర్ ఆండ్రాయిడ్ లైబ్రరీలను డేటాను దొంగిలిస్తుందని కమాండ్-అండ్-కంట్రోల్ సర్వర్ వేదిక వెల్లడించింది.

హ్యాకర్లు బాధితుడిని సేఫ్‌చాట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని నమ్మిస్తారు. లీగల్ చాట్ యాప్‌గా కనిపిస్తుంది. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యాక్సెసిబిలిటీ సర్వీసులను ఉపయోగించడానికి అనుమతులను అడుగుతుంది. ఈ అనుమతులు బాధితుల కాంటాక్టుల లిస్టు, SMS, కాల్ లాగ్‌లు, ఎక్స్‌ట్రనల్ డివైజ్ స్టోరేజీ, GPS లొకేషన్ డేటాకు యాక్సెస్ వంటి మరిన్ని అనుమతులను ఆటోమాటిక్‌గా మంజూరు చేయడానికి యాప్‌ని అనుమతిస్తాయి. ఆండ్రాయిడ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ సబ్‌సిస్టమ్ నుంచి మినహాయింపును ఆమోదించమని షేర్‌చాట్ యాప్ కూడా యూజర్లను అభ్యర్థిస్తుంది.

దాంతో యాప్‌ని యూజర్ యాక్టివ్‌గా ఉపయోగించనప్పుడు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. ఈ డివైజ్‌లో ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసిన ఇతర చాట్ యాప్‌లతో యాప్ ఇంటరాక్ట్ అవుతుంది. చాట్ మెసేజ్‌లు, మీడియా ఫైల్‌ల వంటి ఆ యాప్‌ల నుంచి డేటాను దొంగిలించడానికి యాప్‌ని అనుమతిస్తుంది. దొంగిలించిన డేటా ఎన్‌క్రిప్ట్ అవుతుంది. ఎటాక్ చేసేవారి C2 సర్వర్‌కు పంపుతుంది.

Beware Android users, this fake app is stealing your personal WhatsApp and other apps data

ఎలా సురక్షితంగా ఉండాలి :
సైబర్ దాడులు కొత్తవి కానప్పటికీ.. సంఘటనల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండటం, సురక్షితంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సేఫ్‌చాట్, ఇతర మాల్వేర్ నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి మీ ఆండ్రాయిడ్ డివైజ్ సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ కింది టిప్స్ పాటించండి.

ట్రస్డడ్ సోర్స్ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేయండి :
గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) వంటి అధికారిక యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి. గుర్తుతెలియని మూలాల నుంచి సైడ్‌లోడింగ్ యాప్‌లను నివారించండి. ఎందుకంటే ఆయా యాప్‌లలో మాల్వేర్ ఉండవచ్చు.

యాప్ అనుమతులను చెక్ చేయండి :
అనవసరమైన అనుమతులను అభ్యర్థించే యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక యాప్ ఫంక్షనాలిటీకి సంబంధం లేని సెన్సిటివ్ డేటా లేదా ఫీచర్‌లకు యాక్సెస్ అడిగితే, దాన్ని ఇన్‌స్టాల్ చేయొద్దు.

మీ డివైజ్ అప్‌డేట్ చేస్తూ ఉండండి : లేటెస్ట్ సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ ప్యాచ్‌లతో మీ ఆండ్రాయిడ్ డివైజ్ క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోండి. తయారీదారులు డివైజ్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి అప్‌డేట్స్ రిలీజ్ చేస్తారు.

సెక్యూరిటీ యాప్‌లను ఉపయోగించండి : మాల్వేర్, ఇతర పొటెన్షయల్ థ్రెట్స్ నుంచి మీ డివైజ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా స్కాన్ చేయండి. విశ్వసనీయ ప్రొవైడర్ నుంచి పాపులర్ యాంటీవైరస్ లేదా సెక్యూరిటీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

Read Also : Ola Electric : జూలైలోనూ ఓలాదే ఆధిపత్యం.. ఈవీ మార్కెట్లో 40శాతం వాటాతో జోరుగా అమ్మకాలు..!

ట్రెండింగ్ వార్తలు