Singer Sreerama Chandra shares crazy experience by a lady Fan
Singer Sreerama Chandra : ఇండియన్ ఐడల్ విన్నర్ గా సింగర్ శ్రీరామా చంద్ర అందరికి పరిచయమయ్యాడు. ఎప్పుసొదొ శింగింగ్ కెరీర్ మొదలుపెట్టినా శ్రీరామచంద్రకు ఇండియన్ ఐడల్ తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సింగర్ గా బిజీ అయ్యాడు. నటుడిగా కూడా పలు సినిమాల్లో నటించాడు. తెలుగు బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నాడు శ్రీరామచంద్ర. ప్రస్తుతం శ్రీరామచంద్ర సింగర్ గా, నటుడిగా అకెరీర్ కొనసాగిస్తూనే ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ కి హోస్ట్ గా చేస్తున్నాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సింగర్ శ్రీరామచంద్ర తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో మీ ఫ్యాన్స్ నుంచి చూసిన క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉందా అని అడగగా ఓ లేడీ ఫ్యాన్ చేసిన హడావిడి తెలిపాడు.
Also Read : Devara Update : ‘దేవర’ అప్డేట్.. డబ్బింగ్ మొదలుపెట్టేసిన నటి.. షూటింగ్ అయిపోయిందా?
శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. గతంలో ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత మా ఇల్లు అందరికి తెలిసిపోయింది. ఒక రోజు ఒక అమ్మాయి పెట్టె బేడా సర్దేసుకొని మా ఇంటికి వచ్చేసింది. వాళ్ళ ఇంట్లో శ్రీరామచంద్ర పెళ్లి చేసుకుంటాను అన్నాడు అని చెప్పి వచ్చేసింది అంట. ఫేస్ బుక్ లో ఎవరో నా పేరుతో ఫేక్ అకౌంట్ నుంచి చాట్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నారు. దీంతో ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చేసింది. నేను అప్పుడు ఊళ్ళో కూడా లేను. మా అమ్మ నాకు ఫోన్ చేసి ఇలా ఒక అమ్మాయి వచ్చింది పెళ్లి చేసుకుంటా అన్నావంట అని అడిగింది. నాకు అసలు ఐడియా లేదు, నాకు తెలియదు ఎవరో అని నేను. ఆ అమ్మాయేమో ఆ ఫేస్ బుక్ చాట్ చూపిస్తుంది. దీంతో అది ఫేక్ అకౌంట్ అని అర్థమైంది. మా అమ్మకి కూడా అర్థమయి ఆ అమ్మాయిని కూర్చోపెట్టి భోజనం పెట్టి ఆమెకు అర్థమయ్యేలా ఇది ఫేక్ అకౌంట్, మా వాడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి ఆ అమ్మాయిని ఇంటికి పంపించింది అని తెలిపాడు. ఈ సంఘటన మాత్రం మర్చిపోలేను కాసేపు షాక్ అయ్యాను అని తెలిపాడు. శ్రీరామచంద్రని టెన్షన్ పెట్టిన ఆ యువతి ఎవరో మరి.