Chocolate Paniprui: ఇది చాకొలేట్ పానీపూరి

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ బేకరీ నిర్వాహకుడు తన వినియోగదారుల కోసం చాక్లెట్ పానీపూరి సిద్ధం చేశాడు

Chocolate Paniprui: పానీపూరి అంటే ఇష్టపడని వారుండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు అందరు ఎంతో ఇష్టంగా తినే చిరుతిండి పానీపూరి. ఎన్నో ఏళ్లుగా ఒకే విధమైన పదార్ధాలు ఉపయోగించే తాయారు చేస్తున్న పానీపూరికి మరో ప్రత్యామ్న్యాయం లేదు. భారత్ లో లభించే చిరుతిళ్లల్లో అత్యంత చవకైన తిండి పానీపూరీనే. అయితే కాలం మారేకొద్దీ ఆహార ప్రియుల అభిరుచి కూడా మారిపోతుంది. కొత్త కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు తయారీదారులు సైతం సరికొత్త వంటకాలు సిద్ధం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ బేకరీ నిర్వాహకుడు తన వినియోగదారుల కోసం చాక్లెట్ పానీపూరి సిద్ధం చేశాడు. ఇండోర్ నగరంలోని “జైన్ శ్రీ పానీపూరి సరాఫా” అనే బేకరీలో ఈ చాక్లెట్ పానీపూరి అందుబాటులో ఉంది.

Also read: Bears in Srisailam: మూడు రోజులుగా శ్రీశైలంలో ఎలుగుబంట్లు హల్ చల్

సాధారణ పానీపూరీకే ఇది చాక్లెట్ వెర్షన్ గా చెప్పుకోవచ్చు. గోధుమ పూరి స్థానంలో చాక్లెట్ తో తయారు చేసిన కరకరలాడే పూరి ఉంటుంది. అందులో బంగాళాదుంప/బఠాణి స్థానంలో చాకో చిప్స్, పుదీనా/ చింతపండు రసం స్థానంలో పాల మీగడతో తయారుచేసిన పానకం, చాక్లెట్ సిరప్, డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేస్తారు. పానీపూరీకే చాక్లెట్ వెర్షన్ గా భావిస్తున్న దీని రుచి చూసిన ఇండోర్ నగర వాసులు లొట్టలేసుకుంటూ తింటున్నారు. చాక్లెట్ తో చేసిన మిగతా స్వీట్స్ కంటే ఇది ఎంతో బాగుందంటూ ఆన్ లైన్ లో ఆర్డర్లు కూడా పెడుతున్నారు. ఈ వెరైటీ పానీపూరి గురించి కలాష్ సోని అనే ఫుడ్ బ్లాగర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… సృజనాత్మకత ఉండాలేగానీ.. ఎటువంటి వ్యాపారంలోనైనా దూసుకుపోవచ్చు అనేదానికి ఈ ఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also read: Adventure Bikes: బడ్జెట్ లో టాప్ అడ్వెంచర్ టూరింగ్ బైక్స్

ట్రెండింగ్ వార్తలు