Bhagavad Gita : ఆ పాత్రని అర్ధం చేసుకోవడం కోసం భగవద్గీత చదివాను.. హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ!

ఆ పాత్రని అర్ధం చేసుకోవడం కోసం హాలీవుడ్ నటుడు సిలియన్ మర్ఫీ భగవద్గీత చదివాడట. ఇంతకీ ఆ పాత్రకి, భగవద్గీతకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? ఆ విషయం ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి.

Cillian Murphy read Bhagavad Gita for Christopher Nolan Oppenheimer

Bhagavad Gita : భారతదేశంలో ‘భగవద్గీత’ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అనేది మనందరికి తెలిసిన విషయమే. యుద్దభూమిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడే స్వయంగా ఈ భగవద్గీతని ఉపదేశించినట్లు మన ఇతిహాసాలు చెబుతుంటాయి. ఇక ఈ మహాగ్రంధం గొప్పతనం తెలుసుకొని విదేశాలు సైతం చదువుతుంటారు. తాజాగా ఒక హాలీవుడ్ నటుడు ఒక పాత్రని అర్ధం చేసుకోవడానికి ఈ గ్రంథం చదివినట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ పాత్రకి, భగవద్గీతకి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? ఆ విషయం ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి.

Kajol – Shah Rukh Khan : ‘పఠాన్’ సినిమావి ఫేక్ కలెక్షన్స్ అంటున్న హీరోయిన్ కాజోల్..

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రతి ఒక్కర్ని భయపెట్టిన ఒక సంఘటన, ప్రపంచ యుద్దానికి ముగింపు పలికిన ఆ సంఘటన.. ‘అణుబాంబు’ని తయారు చేయడం. ఈ అణుబాంబుని తయారు చేయడానికి స్ఫూర్తిని ఇచ్చింది భగవద్గీత అని ఎంతమందికి తెలుసు. అణుబాంబుని కొనగొన్నది రాబర్ట్ ఓపెన్ హోమర్. రాబర్ట్.. శాస్త్రీయ విజ్ఞాన పుస్తకాలతో పాటు భగవద్గీతని కూడా చదివాడు. ఈ క్రమంలోనే భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన ఒక శ్లోకం అణుబాంబు తయారీకి ప్రేరణ అయ్యిందని చెప్పుకొస్తాడు. ఇంతకీ ఆ శ్లోకం ఏంటంటే.. ‘సృష్ఠించింది నేనే నాశనం చేసింది నేనే’.

Sai Pallavi : సాయి పల్లవి అమర్‌నాథ్‌ యాత్ర.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఇక ఈ అణుబాంబు తయారు పై హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan).. ‘ఓపెన్‌హోమర్’ (Oppenheimer) పేరుతో సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాలో రాబర్ట్ ఓపెన్ హోమర్ పాత్రని సిలియన్ మర్ఫీ (Cillian Murphy) పోషించాడు. ఓపెన్ హోమర్ పాత్రని అర్ధం చేసుకోవడానికి సిలియన్ మర్ఫీ భగవద్గీత చదివినట్లు చెప్పుకొచ్చాడు. భగవద్గీత గురించి సిలియన్ మర్ఫీ మాట్లాడుతూ.. “ఇది చాలా అందమైన వచనం. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ భగవద్గీత ఓపెన్ హోమర్ కి ఓదార్పునిచ్చింది అని నేను అనుకుంటున్నాను” అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఈ మూవీ జూలై 21న విడుదల కానుంది.

 

ట్రెండింగ్ వార్తలు