Coin toss : కొత్త రూల్‌.. వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ జ‌రుగ‌కపోతే.. కాయిన్ టాస్ విజేత‌.. ఇదేం దిక్కుమాలిన నిబంధ‌న అంటున్న ఫ్యాన్స్‌

ఇంగ్లాండ్‌లో పుట్టింది క్రికెట్‌. అభిమానుల‌ను అల‌రించేందుకు, ఆట‌లో మ‌జాను తీసుకువ‌చ్చేందుకు ఈ గేమ్‌లో ఎన్నో రూల్స్‌ను రూపొందించారు. అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో వాటిని మారుస్తుండ‌డం తెలిసిందే

Coin toss

Coin toss rule: ఇంగ్లాండ్‌లో పుట్టింది క్రికెట్‌. అభిమానుల‌ను అల‌రించేందుకు, ఆట‌లో మ‌జాను తీసుకువ‌చ్చేందుకు ఈ గేమ్‌లో ఎన్నో రూల్స్‌ను రూపొందించారు. అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో వాటిని మారుస్తుండ‌డం తెలిసిందే. ఏదీ ఏమైనప్ప‌టికి అభిమానుల‌ను అల‌రించడ‌మే దీని ముఖ్య ఉద్దేశ్యం. వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్దు అయిన సంద‌ర్భంలో లేదా మ్యాచ్ టై అయిన స‌మ‌యంలో విజేతను ఎలా నిర్ణ‌యించాలి అన్న దానిపై ఇప్ప‌టికే ప‌లు నిబంధన‌లు ఉన్నాయి.

మ్యాచ్ టై అయితే.. బౌల్ అవుట్ లేదా సూప‌ర్ ఓవ‌ర్ ద్వారా విజేత‌ను నిర్ణ‌యిస్తారు. వ‌ర్షం అంత‌రాయం క‌లిగించిన సమ‌యంలో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి(DLS) ప‌ద్ద‌తిని ఉప‌యోగిస్తుంటారు. కొన్ని సార్లు రిజ‌ర్వ్ డేలో ఆట‌ను కొన‌సాగిస్తుంటారు. అయితే.. బెర్ముడా క్రికెట్ బోర్డు ఓ కొత్త ప‌ద్ద‌తిని తీసుకువ‌చ్చింది. ఈ విష‌యం తెలిసిన అభిమానులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.

TNPL : ప‌ర‌మ చెత్త బౌలింగ్‌.. ఒక్క బంతికి 18 ప‌రుగులు.. మాకొద్దు సామీ..!

మ‌న దేశంలో ఐపీఎల్ లాగానే బెర్ములా క్రికెట్ బోర్డు నాకౌట్ కప్ ను నిర్వ‌హిస్తోంది. అక్క‌డ వ‌ర్షాలు ఎక్కువ‌గా ప‌డుతాయి. కాబ‌ట్టి వ‌ర్షం ప‌డి మ్యాచ్ జ‌రుగ‌క పోతే విజేత‌ను నిర్ణ‌యించేందుకు కొత్త ప‌ద్ద‌తిని రూపొందించారు. అదే కాయిన్ టాస్ విజేత‌. అంటే.. టాస్ గెలిచిన జ‌ట్టును విజేత‌గా ప్ర‌క‌టిస్తారు.

BCB క్రికెట్ చైర్మన్ స్టీవెన్ డగ్లస్ రాయల్ మాట్లాడుతూ.. వ‌ర్షం ప‌డి మ్యాచ్ నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితి ఉంటే అప్పుడు టాస్ వేసి విజేత‌ను నిర్ణ‌యించ‌నున్నాం. హోం గ్రౌండ్ కెప్టెన్ టాస్ వేస్తాడు. ప్ర‌త్య‌ర్థి కెప్టెన్ హెడ్ లేదా టెయిల్ అనేది చెబుతాడు. ఎవ‌రైతే టాస్ గెలుస్తారో వారినే విజేత‌గా ప్ర‌క‌టిస్తారు. ఈ త‌తంగం మొత్తం బెర్ముడా క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్ పర్యవేక్షణలో జ‌ర‌గుతుంద‌ని చెప్పుకొచ్చాడు.

దీని గురించి సోష‌ల్ మీడియాలో అభిమానులు మండిప‌డుతున్నారు. ఇక మ్యాచులు కూడా నిర్వ‌హించడం ఎందుకు కేవ‌లం టాస్ వేసి విజేత‌ను తేల్చండి. ఆట‌గాళ్ల‌కు ఆడే శ్ర‌మ కూడా త‌ప్పుతుంది అంటూ ఒక‌రు కామెంట్ చేయ‌గా.. ఒక్క రోజులోనే ప్ర‌పంచ‌క‌ప్ ను కూడా నిర్వ‌హించ‌వ‌చ్చు అంటూ మ‌రొక‌రు వ్యంగంగా స్పందించారు.

Gautam Gambhir : ధోని వ‌ల్ల ప్ర‌పంచ‌క‌ప్‌లు రాలేదు.. అలా అత‌డిని హీరోని చేశారు.. నిజ‌మైన‌ హీరో గురించి మాత్రం మాట్లాడ‌రు

ఈ టోర్నమెంట్ జూన్ 17 న ప్రారంభం కానుండ‌గా జూలై 9న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మొదటి రౌండ్‌లో విజేతలకు 1,000 డాల‌ర్లు, రన్నర్స్-అప్ డాల‌ర్లు 750, సెమీ-ఫైనలిస్ట్‌లు 500 డాల‌ర్లు, ఓడిపోయిన క్వార్టర్-ఫైనలిస్ట్‌లు 250 డాల‌ర్లు ఇవ్వ‌నున్నారు. విజేత‌కు 3,750 డాల‌ర్లు ద‌క్క‌నుంది.

 

ట్రెండింగ్ వార్తలు