BJP on Bharat Jodo Yatra: కాంగ్రెస్‭కు అంత సీన్ లేదట.. భారత్ జోడో ఆపేందుకే కొవిడ్ వచ్చిందన్న కాంగ్రెస్ విమర్శలకు కేంద్రం కౌంటర్

ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ నేతలు స్పందిస్తూ కొవిడ్ నిబంధనలు పాటించకుండా యాత్ర సాగుతోందని, ఆ యాత్రను వెంటనే ఆపేయాలంటూ ప్రకటనలు చేశారు. అంతే, రాహుల్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే కొవిడ్ మంత్రాన్ని జపిస్తోందని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడడం ప్రారంభించారు

BJP on Bharat Jodo Yatra: ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు బీజేపీ నేతలు మాస్కులతో కనిపించారు. ఒక్కసారిగా కొవిడ్ గురించి చర్చ ప్రారంభమైంది. దేశ ప్రజలకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ నేతలు స్పందిస్తూ కొవిడ్ నిబంధనలు పాటించకుండా యాత్ర సాగుతోందని, ఆ యాత్రను వెంటనే ఆపేయాలంటూ ప్రకటనలు చేశారు. అంతే, రాహుల్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని, అందుకే కొవిడ్ మంత్రాన్ని జపిస్తోందని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడడం ప్రారంభించారు. కాగా, కాంగ్రెస్ నేతల విమర్శలపై కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ స్పందిస్తూ.. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని, అలాంటి పార్టీని తాము లెక్కలోకే తీసుకోవడం లేదంటూ కౌంటర్ ఇచ్చారు.

Ram Setu: రామసేతు ఉందని చెప్పడం కష్టమే.. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం షాకింగ్ ఆన్సర్

‘‘కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎందుకు భయపడుతుంది? దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ భారత్ జోడో యాత్రతో అయినా తమ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ నేతలు చాలా ప్రయత్నిస్తున్నారు. మాకెంత మాత్రం పోటీయే కానీ పార్టీపై మేమంతగా ఆలోచించలేం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు. మేము దేశ ప్రజల కోసం ఆలోచిస్తున్నాం’’ అని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 ఉప్పెనను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్‌లో చేపట్టిన ‘జన్ ఆక్రోశ్ యాత్ర’ని నిలిపివేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే మళ్లీ యాత్రను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాదిలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధినేత జేపీ నడ్డా ఈ యాత్రను చేపట్టారు.

Jagdeep Dhankhar: సోనియా వ్యాఖ్యలపై స్పందించడం నా బాధ్యత.. వివరణ ఇచ్చిన ఉపరాష్ట్రపతి ధన్‭కడ్

ట్రెండింగ్ వార్తలు