Corona Update: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో(సోమవారం) దేశంలో కొత్తగా 2,38,018 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం కంటే సోమవారం నాడు స్వల్పంగా తగ్గాయి.

Corona Update: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో(సోమవారం) దేశంలో కొత్తగా 2,38,018 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అయితే కొత్త కేసుల సంఖ్య ఆదివారం కంటే సోమవారం నాడు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 16,49,143 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, 2,38,018 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 17,36,628కి చేరింది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతానికి చేరుకుంది. సోమవారం నాడు దేశ వ్యాప్తంగా 1,57,421 మంది కరోనా నుంచి కోలుకోగా, 310 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 94.09%, మరణాల రేటు 1.29%గా నమోదు అయింది.

Also read: Asteroid:భూ కక్ష్యను దాటుకుంటూ వెళ్లనున్న భారీ గ్రహశకలం

ఇక ఇప్పటి వరకు భారత్ లో కరోన నిర్ధారణ పరీక్షలు 70.54 కోట్లు దాటినటు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 3170 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. 1381 ప్రభుత్వ లాబ్స్, 1789 ప్రైవేట్ లాబ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా ఓమిక్రాన్ బాధితులు ఉన్నారు. దీంతో కరోనా బాధితులకు అందించే చికిత్స విధానంలో పలు సూచనలు చేస్తూ కేంద్ర వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

Also read: Corona Treatment: కరోనా రోగుల చికిత్సకు మార్గదర్శకాలను సవరించిన కేంద్ర ఆరోగ్యశాఖ

ట్రెండింగ్ వార్తలు