Viral Video : బ‌య‌ట జోరున వ‌ర్షం.. ఓ చేత్తో గొడుగు పట్టుకుని మ‌రో చేతితో బస్సు నడిపిన డ్రైవర్.. క‌ట్ చేస్తే..

బ‌య‌ట జోరున వ‌ర్షం ప‌డుతోంది. ఓ బ‌స్సు డ్రైవ‌ర్ ఓ చేత్తో గొడుగు ప‌ట్టుకుని మ‌రో చేతితో బ‌స్సును న‌డుపుతున్నాడు.

బ‌య‌ట జోరున వ‌ర్షం ప‌డుతోంది. ఓ బ‌స్సు డ్రైవ‌ర్ ఓ చేత్తో గొడుగు ప‌ట్టుకుని మ‌రో చేతితో బ‌స్సును న‌డుపుతున్నాడు. కండ‌క్ట‌ర్ దీన్ని రికార్డు చేయ‌గా.. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బెంగ‌ళూరులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఉన్న‌తాధికారులు డ్రైవ‌ర్ తో పాటు కండ‌క్ట‌ర్‌ను స‌స్పెండ్ చేశారు.

నార్త్ వెస్ట్రన్ కర్నాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అంటే nwkrtc వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. గురువారం బెటగేరి-ధార్వాడ మార్గంలో బ‌స్సు వెలుతోంది. ఆ స‌మ‌యంలో డ్రైవర్‌ హనుమంతప్ప కిల్లెదర, కండక్టర్ అనిత డ్యూటీలో ఉన్నారు. వ‌ర్షం ప‌డుతుండ‌డంతో సాయంత్రం స‌మ‌యంలో బ‌స్సులో ప్ర‌యాణీకులు ఎవ‌రూ లేరు. ఆ స‌మ‌యంలో డ్రైవ‌ర్ వినోదం కోసం గొడుగుప‌ట్టుకున్నాడు.

Chhattisgarh : ఛత్తీస్‌గ‌ఢ్‌లో భారీ పేలుడు.. 20మంది మృతి

ఓ చేతిలో గొడుగుప‌ట్టుకుని మ‌రో చేత్తో డ్రైవింగ్ చేస్తున్నాడు. దీన్ని కండ‌క్ట‌ర్ వీడియో తీసింది. ఈ వీడియోను వారు సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌గా కొద్ది సేప‌ట్లోనే వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అయ్యాయి. డ్రైవ‌ర్ ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల రోడ్డు పై వెళ్లే వాహ‌న‌దారుల ప్రాణాల‌కు ప్ర‌మాదం వాటిట్లే అవ‌కాశం ఉంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డ్డారు. వీడియో ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్లింది. విచార‌ణ అనంత‌రం ఇద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. బ‌స్సు పైక‌ప్పులో ఎలాంటి లీకేజీ లేద‌ని, కేవ‌లం వినోదం కోస‌మే ఈ వీడియోను రికార్డు చేసిన‌ట్లు తేల‌డంతో డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌ను స‌స్పెండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు