Lok Sabha Election 2024 : ఆరో విడత పోలింగ్ షురూ.. ఓటింగ్ జరిగే రాష్ట్రాలు, నియోజకవర్గాలు ఇవే..

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఐదు విడతల్లో పోలింగ్ జరగ్గా.. ఆరో విడత

Lok Sabha Election 2024 Phase 6 Voting : దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఐదు విడతల్లో పోలింగ్ జరగ్గా.. ఆరో విడత శనివారం కొనసాగుతుంది. ఇవాళ మొత్తం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఆరో విడత పోలింగ్ ప్రక్రియ పూర్తయితే 486 సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది.

ఇదిలాఉంటే.. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పటిష్ట పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన అనంతనాగ్ -రాజౌరీ స్థానంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సహా మొత్తం 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అక్కడ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఈసీ బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేసింది. మరోవైపు.. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళ పోలింగ్ జరగనుంది.

Also Read : శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్.. అంతర్జాతీయంగా మరింత శక్తిమంతంగా మారిన ఇండియా

పోలింగ్ జరిగే రాష్ట్రాలు.. నియోజకవర్గాలు..
ఆరో విడత పోలింగ్ 58 స్థానాల్లో జరుగుతుంది. వీటిలో యూపీలో 14, హర్యానాలో 10, బీహార్ లో ఎనిమిది, పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, జార్ఖండ్ లో నాలుగు, జమ్ము కశ్మీర్ లో ఒక స్థానంకు పోలింగ్ జరుగుతుంది.
బీహార్ : వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివహర్, వైశాలి, గోపాల్ గంజ్, సివాన్, మహారాజ్ గంజ్.
హర్యానా : అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ – మహేంద్రగఢ్, గుర్గావ్, ఫరీదాబాద్.
ఝార్ఖండ్ : గిరిడి, ధన్ బాద్, రాంచీ, జంషెడ్ పూర్.
ఒడిశా : సంబల్ పూర్, కియోంజర్, దెంకనల్, కటక్, పూరి, భువనేశ్వర్.
ఉత్తరప్రదేశ్ : సుల్తాన్ పూర్, ప్రతాగఢ్, ఫుల్ పూర్, అలహాబాద్, అంబేద్కర్ నగర్, శ్రావస్తి. దమారియాగంజ్, బస్తర్, సంత్ కబీర్ నగర్, లాల్ గంజ్, అజంగఢ్, జౌన్ పూర్, మచ్లిషహర్, భదోహి.
పశ్చిమ బెంగాల్ : తమ్లుక్, కాంతి, ఘటల్, ఝర్గ్రామ్, మేదినీపూర్, పూరూలియా, బంకురా, బిష్ణుపూర్.
ఢిల్లీ : చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ.
జమ్మూ అండ్ కశ్మీర్ : అనంతనాగర్ – రాజౌరి.

Also Read : కవితకు బెయిల్ ఇవ్వాలి, అరెస్ట్‌లో చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయి- కవిత లాయర్ వాదనలు

పోటీలో ప్రముఖులు ..
ఆరో దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రముఖులు కూడా పోటీలో ఉన్నారు.
ఒడిశాలోని సంబల్‌పూర్ నుంచి కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్.
కర్నాల్ నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.
ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్ తివారీ.
న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్.
హర్యానాలోని సిర్సా నుంచి కుమారి శైలజ.
హర్యానాలోని రోహ్ తక్ నుంచి దీపేంద్ర సింగ్ హుడా.
ఢిల్లీలోని చాందినీచౌక్ నుంచి జేపీ అగర్వాల్.
ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్.
న్యూఢిల్లీ స్థానం నుంచి ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతి పోటీలో ఉన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు