శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్.. అంతర్జాతీయంగా మరింత శక్తిమంతంగా మారిన ఇండియా

ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పుడో లెక్క.. అన్నట్లుగా మారిన భారత వైఖరి శత్రుదేశాలకు, వాటి మిత్రదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

శత్రుదేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్.. అంతర్జాతీయంగా మరింత శక్తిమంతంగా మారిన ఇండియా

India : కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది. కొన్ని కథలు వింటే భయమేస్తుంది. అయితే ఈ కథను తలుచుకుంటేనే భయమేస్తుంది. అని సలార్ లో ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఇండియాను చూస్తే ఇలాగే ఉంది. భారత్ ను తలుచుకుంటేనే కొన్ని దేశాలు భయపడిపోతున్నాయి. భారత్ జోలికి వెళ్లాలంటే వాటికి వణుకు పుడుతోంది. ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పుడో లెక్క.. అన్నట్లుగా మారిన భారత వైఖరి శత్రుదేశాలకు, వాటి మిత్రదేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గొ.. కొన్ని దేశాలు భారత్ పై కుట్రలు పన్నుతున్నాయి. మనతో శత్రుత్వం పెట్టుకుంటున్నాయి. భారత్ కు కీడు కలిగించే వారికి ఆశ్రయం ఇస్తున్నాయి. మనకు వ్యతిరేకంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు కుట్రలు పన్నుతుంటే.. ఆయా
దేశాలు చూస్తూ ఊరుకుంటున్నాయి. పాకిస్తాన్ లాంటి దేశాలు స్వయంగా ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నాయి.

ఇంటెలిజెన్స్ ద్వారా ఇతర నిఘా వర్గాల ద్వారా తమ స్వార్ధ గూడచారుల ద్వారా ఈ సమాచారం గురించి సర్వం తెలిసినా గతంలో ఏమీ చేయలేక భారత్ మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి. కానీ, భారత్ ఇప్పుడలా నిర్వేదంగా ఊరుకోవడం లేదు. భారత్ కు హాని తలపెట్టాలన్న ఆలోచన వచ్చేలోపు శత్రువులను మట్టుబెడుతోంది.

Also Read : పక్కలో బల్లెంలా ప్రత్యర్థులు.. ఈ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు