Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 11మంది భక్తులు మృతి

ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ సింధౌలీ నుంచి దాదాపు 40 మంది వరకు భక్తులు ఉత్తరాఖండ్ లోని పూర్ణగిరి మాత దర్శనానికి వోల్వో బస్సులో వెళ్తున్నారు.

Road Accident in Uttarpradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్ పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది భక్తులు మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాబా వద్ద ఆగిఉన్న బస్సుపై ఓవర్ లోడ్ తో వస్తున్న డంపర్ అదుపుతప్పి పడిపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

Also Read : గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 24మంది దుర్మరణం, మృతుల్లో 12మంది చిన్నారులు

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ సింధౌలీ నుంచి దాదాపు 40 మంది వరకు భక్తులు ఉత్తరాఖండ్ లోని పూర్ణగిరి మాత దర్శనానికి వోల్వో బస్సులో వెళ్తున్నారు. షాజహాన్ పూర్ లోని ఓ దాబా వద్ద భోజనంకోసం బస్సును డ్రైవర్ రోడ్డుపక్కన ఆపాడు. ఇందులోని కొందరు ప్రయాణీకులు దాబాలోకి వెళ్లగా.. మరికొందరు బస్సులో ఉన్నారు. ఇదే సమయంలో కంకరతో నింపిన డంపర్ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. అనంతరం బస్సుపై బోల్తాపడటంతో బస్సులోఉన్న 11 మంది మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

 


 

ట్రెండింగ్ వార్తలు