ఢిల్లీలోని బేబీకేర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఆరుగురు నవజాత శిశువులు మృతి

ఢిల్లీలోని షహ్దారా జిల్లా వివేక్ విహార్ ప్రాంతంలోని బేబీకేర్ సెంటర్ లో శనివారం అర్థరాత్రి సమయంలో అగ్నిప్రమదం చోటు చేసుకుంది.

Children Hospital Fire : దేశ రాజధాని ఢిల్లీలోని షహ్దారా జిల్లా వివేక్ విహార్ ప్రాంతంలోని బేబీకేర్ సెంటర్ లో శనివారం అర్థరాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలోని చికిత్స పొందుతున్న ఆరుగురు నవజాత శిశువులు మరణించారు. అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలోనుంచి 12మంది నవజాత శిశువులను బయటకు తీసుకొచ్చారు.. అయితే, వీరిలో ఆరుగురు మరణించగా.. మరో ఆరుగురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

Also Read : గేమింగ్ జోన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 24మంది దుర్మరణం, మృతుల్లో 12మంది చిన్నారులు

నవజాత శిశువుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీబీటీ ఆస్పత్రికి అధికారులు తరలించారు. ఆస్పత్రిలో ఫైర్ సేప్టీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? మరే ఇతర కారణాల వల్లనైనా ప్రమాదం జరిగిందా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఆస్పత్రితో పాటు పక్కన ఉన్న మరో భవనంలోకి మంటలు వ్యాపించడంతో.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్

ట్రెండింగ్ వార్తలు