Chhattisgarh : ఛత్తీస్‌గ‌ఢ్‌లో భారీ పేలుడు.. 20మంది మృతి

ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెమెతర జిల్లాలోని గన్ ఫౌండర్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.

Chhattisgarh Huge explosion : ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెమెతర జిల్లాలోని గన్ ఫౌండర్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. శనివారం ఉదయం జరిగిన ఈ పేలుడులో 20మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు గాయపడిన వారికి చికిత్స నిమిత్తం రాయ్ పూర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Also Read : టీవీ, వాషింగ్ మెషీన్, ఏసీ ధరలు పెరగనున్నాయా? ఎర్ర సముద్రంలో సంక్షోభమే కారణమా..

ప్రమాదం జరిగిన సమయంలో గన్ ఫౌండర్ ఫ్యాక్టరీలో దాదాపు 100 మంది ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. స్థానిక ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ఇదిలాఉంటే.. ఎస్‌డిఎంతో సహా పరిపాలన బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు బెమెతర కలెక్టర్ తెలిపారు. మృతులకు సంబంధించిన అధికారిక ధృవీకరణ రాలేదు.

 

ట్రెండింగ్ వార్తలు