కారులో వెళ్తూ గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యి.. వాగు నీటిలో పడిపోయిన హైదరాబాదీలు

Google Maps: గత అర్ధరాత్రి ఓ మహిళ సహా నలుగురు వ్యక్తులు అలప్పుజ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Google Map: తెలియని ప్రాంతాలకు వెళ్లడానికి గూగుల్ మ్యాప్‌లను చాలా మంది వాడుతున్నారు. చాలా వరకు అది కచ్చితంగానే తీసుకెళ్తున్నప్పటికీ, దాన్ని గుడ్డిగా నమ్మితే మాత్రం ప్రమాదాలు తప్పవు. తాజాగా, హైదరాబాద్‌కు చెందిన కొందరు కేరళలో గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ వెళ్లి నీటి ప్రవాహంలోకి వెళ్లిపోయారు.

అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, వారి కారు మాత్రం నీటిలో మునిగిపోయింది. దక్షిణ కేరళ జిల్లాలోని కురుప్పంతర సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి ఓ మహిళ సహా నలుగురు వ్యక్తులు అలప్పుజ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

వారు ప్రయాణించిన దారి భారీ వర్షాల కారణంగా నీటితో నిండిపోయిందని అధికారులు తెలిపారు. అయితే, ఆ నలుగురు హైదరాబాదీయులకు ఆ ప్రాంతం గురించి తెలియని కారణంగా వారు గూగుల్ మ్యాప్‌లను వాడారు. వారు నీళ్లలో పడిపోగా వెంటనే పోలీసు పెట్రోలింగ్ యూనిట్, స్థానికులు అప్రమత్తమై రక్షించారు.

కేరళలో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరుడు అక్టోబరులో ఇద్దరు యువ వైద్యులు కారు ప్రమాదంలో ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయారు. వారు కూడ గూగుల్ మ్యాప్స్‌నే వాడి డ్రైవ్ చేశారు.

Also Read: కార్లతో ఢీ కొట్టుకుంటూ.. సినిమాను తలపించేలా నడిరోడ్డుపై ఫైటింగ్

ట్రెండింగ్ వార్తలు