Viral Video: కార్లతో ఢీ కొట్టుకుంటూ.. సినిమాను తలపించేలా నడిరోడ్డుపై ఫైటింగ్

ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడి భవనంలో నుంచి ఓ వ్యక్తి మొబైల్లో ఈ దృశ్యాలు రికార్డు చేశాడు.

Viral Video: కార్లతో ఢీ కొట్టుకుంటూ.. సినిమాను తలపించేలా నడిరోడ్డుపై ఫైటింగ్

సినిమా యాక్షన్ సీన్‌ను తలపించేలా కార్లతో ఢీ కొట్టుకుంటూ నడిరోడ్డుపై ఫైటింగ్ చేసుకున్నారు ఆరుగురు యువకులు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని ఉడిపిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు గాయపడ్డాడు. రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు.

మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆర్థిక తగాదాల కారణంగానే గొడవ జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడి భవనంలో నుంచి ఓ వ్యక్తి మొబైల్లో ఈ దృశ్యాలు రికార్డు చేశాడు.

రెండు మారుతీ స్విఫ్ట్ కార్లతో యువకులు ఢీ కొట్టుకుంటూ ఘర్షణకు దిగారు. ఒక కారు స్పీడ్‌గా రివర్స్‌ గేర్ లో వచ్చి మరో కారు బానెట్‌ని ఢీ కొట్టింది. ఓ కారు వద్ద ఉన్న వ్యక్తిని మరో కారులోని వ్యక్తి ఢీకొట్టాడు.

Also Read: నటి హేమకు మరో బిగ్‌షాక్‌.. 27న విచారణకు రావాలంటూ నోటీసులు