Delhi Yellow Alert : ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు కఠినతరం.. ఎల్లో అలర్ట్.. వేటికి అనుమతి? వేటికి లేదంటే?

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం కఠినతరం చేసింది. అలాగే కోవిడ్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Yellow alert in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం కఠినతరం చేసింది. అలాగే కోవిడ్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రెండు మూడు రోజులుగా కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం కంటే ఎక్కువగా పెరిగిపోయింది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్-I (Yellow Alert)ని అమలు చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేశారు. ఢిల్లీలో ఎల్లో అలెర్ట్‌లో భాగంగా సినిమా హాళ్లు, జిమ్స్, స్పాలు మూతపడనున్నాయి.

స్కూల్స్, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, స్పాలు, జిమ్‌లు, ల్టీప్లెక్స్‌లు, బాంక్వెట్ హాల్స్, ఆడిటోరియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మూసివేయనున్నారు.  అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. ఇక పెళ్లిళ్లు, అంతిమ సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతించనున్నారు.

మతపరమైన ప్రార్ధనా మందిరాలోకి భక్తుల ప్రవేశంపై కూడా నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీ మెట్రో, బస్సులు, రెస్టారెంట్లు, బార్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి పరిమితి విధించింది. ఆటో,క్యాబ్‌లో ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే అనుమతి ఉంది. దుకాణ సముదాయాలు, మాల్స్‌లో దుకాణాలను సరి, భేసి విధానంలో నిర్వహించుకునేలా అనుమతినిచ్చింది. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతినిచ్చింది.

వీక్లీ మార్కెట్లలో 50 శాతం దుకాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. భవన నిర్మాణ పనులకు, ఈ కామర్స్ డెలివరీలకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది.

కరోనావైరస్ కేసులతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతోంది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వారితో కఠినంగా వ్యవహరించాలని ఢిల్లీ ప్రభుత్వం పోలీసులను, ఇతర అధికారులను ఆదేశించింది. కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలను కూడా ప్రభుత్వం నిషేధించింది. డిసెంబర్ 27న ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమల్లోకి వచ్చింది.

Read Also : Anti-Covid Pill : మరో రెండు కొత్త వ్యాక్సిన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ట్రెండింగ్ వార్తలు