Tamil Nadu : తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన జొమాటో డెలివరీ ఏజెంట్.. అభినందనలు చెబుతున్న నెటిజన్లు

డెలివరీ ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేరయ్యాడు. అతని కష్టం ఫలించి అందులో విజయం సాధించాడు. అతని విజయాన్ని జొమాటో తమ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

Tamil Nadu

Tamil Nadu : ఓ వైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు ప్రిపేర్ అవుతూనే మరోవైపు జొమాటో డెలివరీ ఏజెంట్‌గా పనిచేశాడు. అతని కష్టం ఫలించి పరీక్షలో విజయం సాధించాడు. ఈ విషయాన్ని జొమాటో ట్విట్టర్‌లో షేర్ చేయడం విశేషం.

Rajamouli : దేవాలయాలు అద్భుతం, తమిళ్ ఫుడ్ సూపర్ అంటూ.. తమిళనాడు ట్రిప్‌పై రాజమౌళి స్పెషల్ పోస్ట్..

చాలామంది ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారిని చూస్తుంటాం. చదువుకుంటూ..ఫ్యామిలీని ఆర్ధికంగా ఆదుకోవడానికే చాలామంది యువత కష్టపడుతుంటారు. అలాగే తమిళనాడుకి చెందిన విఘ్నేష్ జొమాటో ఏజెంట్‌గా పనిచేస్తూనే మరోవైపు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష (TNPSC) పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు.అతని సంకల్పం, కష్టం పనిచేశాయి. అంతే .. పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఈ విషయాన్ని జొమాటో ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘జొమాటో డెలివరీ పార్టనర్ గా పనిచేస్తున్నప్పుడు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విఘ్నేష్‌కి హృదయపూర్వకంగా ఒక లైక్ ఇవ్వండి’ అంటూ ట్యాగ్ చేసింది. ఈ పోస్టుపై నెటిజన్లు అభినందనలు కురిపిస్తున్నారు.

Chennai Metro Recruitment : మెట్రో రైల్ లిమిటెడ్ చెన్నైలో పలు పోస్టుల భర్తీ

‘విఘ్నేష్ ఇప్పుడు ఆర్డర్లపై సంతకం చేస్తాడు’ అని.. ‘వావ్.. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విఘ్నేష్‌కి అభినందనలు’ అంటూ అనేకమంది అభినందనలు తెలిపారు. ఒకవైపు తను కష్టపడుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలబడటమే కాకుండా.. తన కల అయిన పరీక్షలో విజయం సాధించిన విఘ్నేష్ నిజంగా చాలామందికి ప్రేరణగా నిలిచాడు.

ట్రెండింగ్ వార్తలు