Animal Diseases : వర్షాకాలంలో జీవాలకు ఆశించే వ్యాధులు నివారణ చర్యలు

జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు అధికంగా రావటంతో మందలో మరణాల శాతం పెరిగి, రైతులు నష్టపోతున్నారు.  ఎండాకాలం పోయింది. వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే జీవాల పెంపకందార్లు అత్యంత  జాగ్రత్తగా వుండాలి.

Animal Diseases

Animal Diseases : తొలకరి ప్రారంభమైంది. వర్షాలు ఆలస్యమైనా చాలా వరకు చిరుజల్లులు పడటంతో అక్కడక్కడ పచ్చిక బయళ్లు పెరిగాయి. అయితే కొత్తచిగుళ్లను అనేక క్రిములు ఆశిస్తాయి. వీటిని మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ మూడు నెలలు అప్రమత్తంగా వుండాలి. వ్యాధులను గుర్తించగానే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు   పి.వి. నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. సుష్మ

READ ALSO : Azolla Cultivation : పాడిపశువవులు, కోళ్లు, జీవాలకు మేతగా అజొల్లా.. అజొల్లా సాగుతో తగ్గనున్న పశుగ్రాసం ఖర్చు

జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు అధికంగా రావటంతో మందలో మరణాల శాతం పెరిగి, రైతులు నష్టపోతున్నారు.  ఎండాకాలం పోయింది. వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే జీవాల పెంపకందార్లు అత్యంత  జాగ్రత్తగా వుండాలి.

తొలకరిలో ముఖ్యంగా  చిటుక రోగం, నీలి నాలుక,  గాలికుంటు వ్యాధి, పిపిఆర్ రోగాలు వస్తాయి. వీటి నివారణ పట్ల అప్రమత్తంగా ఉండి, ముందుజాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి. లేదంటే జీవాలు చనిపోయి తీవ్రనష్టం ఏర్పడుతుందంటూ  తెలియజేస్తున్నారు పి.వి. నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. సుష్మ

READ ALSO : Cultivation Of Marigolds : కొబ్బరిలో అంతర పంటగా బంతిపూల సాగు

వర్షాకాలంలో జీవాల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గొర్రెలు లేదా మేకలు అనారోగ్యానికి గురైతే  వెంటనే మందనుండి వేరు చేసి చికిత్స చేయించాలి. ముఖ్యంగా జీవాల మేపులో బలవర్థకమైన ఆహారం అందుబాటులో వుంచితే, వ్యాధినిరోధక శక్తి వృద్ధిచెంది పెరిగి, ఆరోగ్యంగా పెరుగుతాయి.

వర్షాకాలంలో జీవాల పెంపకం దారులు  నిర్లక్ష్యం వహిస్తే, అనారోగ్యానికి గురై చనిపోతాయి. దీనివల్ల ఆర్ధికంగా ఎంతో నష్టం కలుగుతుంది. వ్యాధులను గుర్తించన వెంటనే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు