James Anderson : జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన ఘ‌న‌త‌.. 1100 వికెట్ల క్ల‌బ్‌లో చేరిక‌

ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జేమ్స్ అండ‌ర్స‌న్‌(James Anderson) అరుదైన ఘ‌న‌త సాధించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మూడో రోజు ఆట‌లో అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు.

James Anderson

Anderson : ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జేమ్స్ అండ‌ర్స‌న్‌(James Anderson) అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో(టెస్టుల‌ను క‌లుపుకుని) 1100 వికెట్లు తీశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు మూడో రోజు ఆట‌లో అత‌డు ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఆసీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో అలెక్స్ కేరీ వికెట్ తీయ‌డం ద్వారా అండ‌ర్స‌న్ ఈ ఘ‌న‌త‌ను సాధించాడు.

ఈ సంద‌ర్భంగా ఈసీబీ అత‌డికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. కింగ్ ఆఫ్ స్వింగ్ అంటూ ట్వీట్ చేసింది. జేమ్స్ అండ‌ర్స‌న్ 2002లో ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. 289 మ్యాచుల్లో 1100 వికెట్లు తీశాడు. 5 వికెట్ల ఘ‌న‌త (ఇన్నింగ్స్‌లో) 54 సార్లు, 10 వికెట్ల‌ను(మ్యాచ్‌లో) 6 సార్లు సాధించాడు. అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాలు 7/19.

ENG VS AUS Ashes : ఆస్ట్రేలియా 386 ఆలౌట్.. ఇంగ్లాండ్‌కు స్వ‌ల్ప ఆధిక్యం

కాగా.. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఘ‌నత‌ ఇంగ్లాండ్‌కు చెందిన విల్‌ఫ్రెడ్ రోడ్స్ పేరిట ఉంది. విల్‌ఫ్రెడ్ 1,110 మ్యాచుల్లో 4,204 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ త‌రువాత ఇంగ్లాండ్‌కే చెందిన టిచ్ ఫ్రీమాన్ 592 మ్యాచ్‌లలో 3,776 వికెట్లు, చార్లీ పార్కర్ 635 మ్యాచ్‌లలో 3,278 వికెట్లతో త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

Moeen Ali : చేతులకు స్ప్రే చేసుకుంటూ క‌నిపించిన ఆట‌గాడు.. భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ

టెస్టుల విష‌యానికి వ‌స్తే 2003లో అండ‌ర్స‌న్ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 180 మ్యాచుల్లో 686 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 32 సార్లు 5 వికెట్ల, మూడు సార్లు 10 వికెట్ల ఘ‌న‌త‌ను సాధించాడు. అత్యుత్త‌మ గ‌ణాంకాలు 7/42. టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో అండ‌ర్స‌న్ మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. తొలి స్థానంలో శ్రీలంక‌కు చెందిన ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (800) ఉండ‌గా, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్‌(708) రెండో స్థానంలో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు