Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఫీల్డ్ అసిస్టెంట్లు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిరసన తెలపాలనుకునేవారికి హుజూరాబాద్‌ వేదికలా మారింది.

Field assistants to contest : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిరసన తెలపాలనుకునేవారికి హుజూరాబాద్‌ వేదికలా మారింది. ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ వర్గాల వ్యక్తులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, నిరుద్యోగులు తమవాణిని ప్రభుత్వానికి, ప్రజలకు వినిపించాలన్న ఆశయంతో నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద క్యూ కడుతున్నారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఇవాళ నామినేషన్లు వేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

హుజురాబాద్ ఉప ఎన్నికపోరు ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ బైపోల్‌కు రేపటితో నామినేషన్ల గడువు ముగియబోతోంది. ఇప్పటివరకు 9మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక మిగిలింది ఒక్కరోజే కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. రేపు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనుండగా.. ఆఖరిరోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

Huzurabad By-Election : హుజూరాబాద్‌లో త్రిముఖ పోరు..టీఆర్ఎస్ – బీజేపీ మధ్యే ప్రధాన పోటీ..!

హుజరాబాద్‌లో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ రెండుసెట్లు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ బరిలో నిలవగా.. వారిద్దరూ రేపు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హాజరుకానుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు