Garlic : పక్షవాతం ముప్పును తప్పించే వెల్లుల్లి!

శరీరానికి ఉపయోగపడే హైడెన్సిటీ లిపో ప్రొటీన్ కొలెస్ట్రాల్ ను పెంచటంతోపాటు శరీరానికి హాని కలిగించే లిపో ప్రొటీన్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

Garlic : ప్రాచీన కాలం నుండి వెల్లుల్లిని గృహవైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో దీనిని ఔధంగా ప్రాముఖ్యత కలిగి ఉంది. అందుకే దీనిని మహా ఔషదిగా పిలుస్తారు. దగ్గు , జలుబు, కడుపు ఉబ్బరం, గొంతునొప్పి, వంటి చిన్ని చిన్నరుగ్మతలకు గృహ వైద్యంగా ఉపయోగిస్తారు. అయితే వెల్లుల్లి వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండెకు వెల్లుల్లి చేసే మేలు అంతాఇంతా కాదు. రక్త నాళాల్లో ఆటంకం లేకుండా రక్తం ప్రవహించటానికి తోడ్పడుతుంది.

శరీరానికి ఉపయోగపడే హైడెన్సిటీ లిపో ప్రొటీన్ కొలెస్ట్రాల్ ను పెంచటంతోపాటు శరీరానికి హాని కలిగించే లిపో ప్రొటీన్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది. దీనిని నిత్యం ఆహార పదార్ధాల్లో వాడుకోవటం వల్ల
పక్షవాతం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రక్త ప్రసరణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. వెల్లుల్లిలో ఎల్లిసిన్ అనే పదార్ధం రక్త సరఫరా సక్రమంగా జరిగేలా తోడ్పడుతుంది. ఇది ఘాటైన వాసను కలిగి ఉంటుంది.

వెల్లుల్లిలో ఎల్లిసిన్ నష్టపోకుండా ఉండాలంటే వేడి వేడి అన్నం ముద్దలో ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టుకుని మింగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వెల్లుల్లి పేస్టు రూపంలో కాకుండా తాజా చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆహారపదార్ధాల్లో కలపి తీసుకోవటవల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నశింప చేస్తుంది. మూత్రాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని విషపదార్ధాలను బయటకు వెళ్ళేలా చేస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు