Good For Crops : పంటలకు మేలు చేసే….వేసవి దుక్కులు..

దుక్కి చేయడం అనేది భూమిలో ఉన్న తేమపైన ఆధారపడి ఉంటుంది. తేలిక నేలల్లో కొంచేం తేమ ఎక్కువగా ఉన్నా కూడా దుక్కి చేసుకోవచ్చు.

Summer Deep Plowing

Good For Crops : పంటసాగు పూర్తయ్యాక వేసవిలో భూములు ఖాళీగా ఉంటాయి. ఈ సమయంలోనే భూసారం పెరిగేలా సరైనా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా మార్చి, ఏప్రిల్‌, మే వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.నీటి వసతి ఉన్న భూములు తప్ప వర్షాధారంగా పండించే భూములన్నీ వేసవికాలంలో ఖాళీగా ఉంటాయి. తొలకరి వర్షాలు కురిసే నాటికి భూమిని లోతుగా దుక్కులు చేసుకోవడం వల్ల భూమిపై పొరలు లోపలికి, లోపలి పొరలు భూ ఉపరితలానికి చేరతాయి. ఈ దుక్కులను వేసవిదుక్కులు అంటారు. వీటి వల్ల పంటకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల వానకాలం పంటలో తెగుళ్లు, కలుపు మొక్కల నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది.

వేసవిలో దుక్కులు చేయటం వల్ల అనేక ప్రయోజనాలు ; వేసవి దుక్కుల వల్ల నేల బాగా గుల్లబారుతుంది. తరువాత పడే వర్షపు నీరు వృధాకాకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు నేలను లోతుగా వాలుగు అడ్డంగా దున్నుకోవడం వల నేలకోతను మరియు భూమిపై పొరల్లోని భూసారాన్ని కొట్టుకొనిపోకుండా అరికట్టవచ్చు. భూమిని ఒక అడుగు లోతు వరకు దున్నుకుంటే విత్తనం మొలకెత్తి వేర్లు సులభంగా భూమిలోపలికి దిగి భూమిలోని పోషక పదార్థాన్ని, తేమను గ్రహించి మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి. లోతు దుక్కుల వల్ల భూమిలోకి నీరు ఇంకి, తేమ శాతం పెరగడం వల్ల సేంద్రియ పదార్థాలు త్వరగా కుళ్ళి పోషక రూపంలో అందుబాటులోకి వస్తాయి. భూమిలో దాగి ఉన్న చీడపీడల కోశస్థదశలు, పురుగులు, బ్యాక్టీరియా, శిలీంధ్ర సిద్ధ బీజాలు, కలుపు మొక్కల విత్తనాలు ఎండవేడిమికి లోనై చాలా వరకు నశిస్తాయి. వేసవి దుక్కుల వల్ల కలుపు మొక్కలు వేర్లతో సహా పెకిలించబడి నేలలో కలసిపోతాయి మరియు సేంద్రియ పదార్థంగా ఏర్పడతాయి.

వేసవి దుక్కులు దున్నే ముందు పశువులు పెంట, పోగు, కంపోస్టు ఎరువు, మట్టిని వెదజల్లడం ద్వారా సారవంతమైన పంట దిగుబడితో పాటు తేమశాతం పెరుగుతుంది. దుక్కి లోతు మనం పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెద్దమడకతో లోతుదుక్కి అంటే 30 సెం.మీ. చేయడం మంచిదని సిఫార్సు చేశారు. ప్రతి సంవత్సరం వర్షాలను బట్టి 15-20 సెం.మీ. లోతు వరకు దున్నుకోవాలి. సాధారణంగా తల్లి వేరు వ్యవస్థ ఉన్న పంటలకు లోతు దుక్కి అవసరం. పీచు వేర్లు ఉన్న పంటలకు కొంచెం తక్కువ లోతు దుక్కి సరిపోతుంది. భూమిలో తక్కువ తేమ ఉన్నప్పుడు దుక్కి చేసినట్లయితే దుక్కి చేయడానికి ఎక్కువ శక్తి అవసరమై దుక్కి కూడా బాగుండక భూమి గుల్లబారదు. భూమిలో ఎక్కువ తేమ ఉన్నప్పుడు దుక్కి చేసినట్లయితే నాగలికి మట్టి అంటుకుంటుంది. మరియు కింద ఉన్న మట్టి గట్టిపడి భూమిలో గట్టిపొరలు ఏర్పడతాయి.

దుక్కి చేయడం అనేది భూమిలో ఉన్న తేమపైన ఆధారపడి ఉంటుంది. తేలిక నేలల్లో కొంచేం తేమ ఎక్కువగా ఉన్నా కూడా దుక్కి చేసుకోవచ్చు. అయితే బరువునేలల్లో తగినంత తేమ ఉన్నప్పుడే దుక్కి చేసుకోవాలి. ఎక్కువ తేమ ఉన్నట్లయితే దుక్కి చేసుకోకూడదు. పైదుక్కులకు మామూలు నాగలి లేదా చెక్కల గుంటక కాని వాడాలి. బాగా లోతు దుక్కి చేసి నేలను తిరగతోడడానికి ట్రాక్టరుతో లాగే మోల్డ్‌బోర్డ్‌ మడకను వాడాలి. అధునాతనంగా వచ్చిన ట్రాక్టరుతో లాగే పెద్ద మడకలు, రోటోవేటర్స్‌ వంటి వ్యవసాయ పనిముట్లను ఉపయోగించవచ్చు. వేసవి దుక్కులు దున్నేముందు పొలంలో గొర్రెలు, పశువుల మందలు తోలడం వల్ల అవి విసర్జించిన వ్యర్థాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థం తయారవుతుంది. ఫలితంగా భూసార వృద్ధ్దిలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

దుక్కులు చేయటం మూలంగా పంట చెత్త, చెదారం, ఎండు ఆకులు, నేల పొరల్లో కలిసిపోయి ఎరువుగా మారి భూసారం పెరుగుతుంది. పంటకు కావలసిన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. వేసవి లోతు దుక్కుల వలన నిద్రావస్థ దశలో భూమిలోని చీడపురుగుల కో శాలు, గుడ్లు, లార్వాలు, గుడ్లను, పక్షులు, కొంగలు, కాకులు తిని వాటిని నాశనం చేస్తాయి. వేసవి దుక్కల వల్ల భూమిలోపల పొరల్లో ఉన్న శిలీంధ్ర బీజాలు మట్టతో పాటు నేలపైకి వస్తాయి. బయట అధిక ఉష్ణోగ్రతలకు అవి చనిపోతాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు