KL Rahul : టీమిండియా అభిమానులకు శుభవార్త.. కేఎల్ రాహుల్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు ..

ఐపీఎల్ 2023లో రాహుల్ గాయపడ్డాడు. అప్పటి నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతను గాయం నుంచి కోలుకున్నాడు.

KL Rahul

Team India KL Rahul: భారత క్రికెట్ జట్టు అభిమానులకు శభవార్త. కొంతకాలంగా గాయం కారణంగా క్రికెట్ కు దూరమైన టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నెట్స్ లో బ్యాటింగ్ తో పాటు, వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాహుల్ త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీలో చేరేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నటు ఈ వీడియోలో చూడొచ్చు. 2023 మార్చి నెలలో భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడిన రాహుల్.. మళ్లీ టీమిండియా జట్టులోని పునరాగమనం చేయలేకపోయాడు.

KL Rahul-Memes: కేఎల్ రాహుల్ పై మరోసారి సెటైర్లు.. మీమ్స్ తో ఆడుకుంటున్న నెటిజన్లు

ఐపీఎల్ 2023లో రాహుల్ గాయపడ్డాడు. అప్పటి నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అతను గాయం నుంచి కోలుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ బృందం పర్యవేక్షణలో ఉండి ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాహుల్ తో పాటు జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఐర్లాండ్ పర్యటనకోసం బుమ్రా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అయితే, రాహుల్ టీమిండియా జట్టులోకి రావాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

Suresh Raina : సురేష్ రైనా వ్యాయామం వీడియో చూశారా.. ఇలాచేస్తే ఫుల్ ఫిట్‌నెస్ అట.. ఎంట్రీ ఇచ్చిన శ్రీశాంత్

రాహుల్ భారత్ తరపున 2017 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. చివరి వన్డే మ్యాచ్ 2023 మార్చిలో ఆస్ట్రేలియాతో ఆడాడు. 2023 ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే, బెంగూళరు, సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే రాహుల్ మైదానం వీడాడు.

 

ట్రెండింగ్ వార్తలు