Gandhi Hospital : డాక్టర్లకు ఫుల్ సెక్యూరిటీ.. గాంధీ ఆసుపత్రిలో మూడంచెల పోలీసు భద్రత

గాంధీ ఆసుపత్రిలో పోలీస్‌ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మూడంచెల భద్రత కల్పించారు. గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని..

Gandhi Hospital : కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోలీస్‌ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మూడంచెల భద్రత కల్పించారు. నార్త్ జోన్ పోలీసులు పికెట్స్ పెంచారు. కరోనా సేవల సమయంలో గతంలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకుని పోలీస్ భద్రత పెంచారు.

Omicron: ఒమిక్రాన్ కొత్త లక్షణాలు.. కంటిలో ఈ మార్పులు కనిపించొచ్చు

నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో భద్రతను పర్యవేక్షిస్తారు. షిఫ్ట్‌ల వారీగా పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. ప్రతి షిఫ్ట్‌లో 35మంది పోలీసులు ఉంటారు. మొత్తం 150మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించారు. భద్రత సంఖ్య మరింత పెంచే యోచనలో పోలీస్ కమిషనర్ ఉన్నారు.

Perni Nani : సమ్మె వద్దు.. చెప్పుడు మాటలు వినొద్దు, జగన్ చాలా బాధపడుతున్నారు

ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు సీఐలు, 25 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్ అండ్ హోమ్ గార్డులతో భద్రతను పర్యవేక్షిస్తారు. ఎమర్జెన్సీ వార్డు, ఐసీయూ, ఏఎంసీ వార్డు, మార్చురీ, ఓపీ బ్లాక్, జనరల్ వార్డు ఆసుపత్రి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల దగ్గర, ఔట్ పోస్టుల దగ్గర పోలీసుల పికెట్ ఏర్పాటు చేశారు. కరోనా ఆపత్కాలంలో ప్రాణాలు లెక్క చేయకుండా సేవలందిస్తున్న వైద్యులకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. భద్రత విషయంలో గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో మాట్లాడారు.

ట్రెండింగ్ వార్తలు