Sharad Yadav: శరద్ యాదవ్ చొరవ చూపకపోతే లాలూ ప్రసాద్ యాదవ్‭ ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు

అప్పటికే జార్జ్ ఫెర్నాండెజ్, అజిత్ సింగ్, రాం సుందర్ దాస్ వంటి నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్.. రాం సుందర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతలో మాజీ ప్రధాని చంద్రశేఖర్ వర్గం వ్యక్తి రఘునాత్ ఝా సైతం ముఖ్యమంత్రి రేసులోకి వచ్చారు. అప్పుడే గేమ్ చేంజ్ చేశారు శరద్ యాదవ్. ఉప ప్రధాని దేవీలాల్‭తో శరద్ యాదవ్‭కు మంచి సంబంధాలు ఉన్నాయి.

Sharad Yadav: ఢిల్లీకి సమీపంలోని గురుగ్రాంలో ఉన్న ఆసుపత్రిలో మరణించిన సోషలిస్ట్ నేత శరద్ యాదవ్ గురించిన రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దేశంలో చాలా మంది రాజకీయ నేతలకు భిన్నమైన రాజకీయ వ్యక్తిత్వం ఆయనది. వ్యక్తిగత ప్రయోజాలకు దూరంగా ఉంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాలు చేసిన అతి తక్కువ మంది నేతల్లో శరద్ యాదవ్ ఒకరు. అయితే బిహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ అవ్వడంలో శరద్ యాదవ్ పాత్రపై ప్రస్తుతం ఎక్కువ చర్చ జరుగుతోంది.

Car-Dragging Death: ఢిల్లీలో మహిళను ఈడ్చుకెళ్లిన కారు ప్రమాదంపై హోంశాఖ చర్యలు.. 11 మంది పోలీసులు సస్పెండ్

అది 1990వ సంవత్సరం. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం. దానికి ఏడాదికి ముందే దేశంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. దేశాన్ని నిరాటకంగా పాలిస్తున్న కాంగ్రెస్ ఓటమి పాలైంది. జనతాదళ్ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఇది జరిగిన ఏడాది అనంతరం బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనుకున్నట్టుగానే రాష్ట్రంలో కూడా జనతాదశ్ పార్టీ విజయం సాధించింది. అయితే గెలవనైతే గెలిచారు కానీ, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అయోమయం నెలకొంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించుకుండా ఎన్నికలు వెళ్లిన ఫలితం ఇది.

Srinagar Airport: శ్రీనగర్‌‌ ఎయిర్‌‌పోర్టులో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన విమానాలు

అప్పటికే జార్జ్ ఫెర్నాండెజ్, అజిత్ సింగ్, రాం సుందర్ దాస్ వంటి నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్.. రాం సుందర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతలో మాజీ ప్రధాని చంద్రశేఖర్ వర్గం వ్యక్తి రఘునాత్ ఝా సైతం ముఖ్యమంత్రి రేసులోకి వచ్చారు. అప్పుడే గేమ్ చేంజ్ చేశారు శరద్ యాదవ్. ఉప ప్రధాని దేవీలాల్‭తో శరద్ యాదవ్‭కు మంచి సంబంధాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్‭ని పోటీకి దింపారు. అతి స్వల్ప మెజారిటీతో లాలూ గెలుపొందారు. తిరగేస్తే, 15 ఏళ్లు బిహార్ ముఖ్యమంత్రిగా లాలూ చక్రం తిప్పారు.

ట్రెండింగ్ వార్తలు