Sankranti Bus Stands Passengers : సంక్రాంతికి పల్లెబాట పడుతున్న నగరవాసులు.. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

హైదరాబాద్ లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు.

Sankranti Bus Stands Passengers : హైదరాబాద్ లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. టీఎస్ఆర్టీసీ మొత్తం 4,233 బస్సులను సంక్రాంతి పండుగకు నడుపుతోంది.

ఈసారి సంక్రాంతికి సాధారణ ఛార్జీలతోనే బస్సులను నడపుతోంది. అంతేకాకుండా బస్సులో అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీని ఆర్టీసీ ప్రకటించింది. అటు రోజూ నడిచే రైళ్లతోపాటు సంక్రాంతికి కోసం 94 ప్రత్యేక రైళ్లు, మరో 46 ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. మొత్తం 140 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. 12 నుంచి 21వరకు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. టికెట్ తనిఖీలు చేసే వారి సంఖ్య 20 నుంచి 40కి పెంచారు.

TSRTC: సంక్రాంతి ప్రయాణానికి సర్వం సిద్ధం: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్

అటు రైల్వే ప్రయాణికులు కౌంటర్ల దగ్గర ఇబ్బంది పడకుండా ఫోన్ లలో యూపీస్ యాప్, ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు. మరోవైపు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని జాతీయ సిబ్బందిని 15 నుంచి 30 శాతం వరకు పెంచారు. అటు 65వ జాతీయ రహదారిపై వాహనాలు భారులు తీరి ఉన్నాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ పెరుగుతోంది. దీంతో ఫాస్టాగ్ స్కాన్ సమయాన్ని 3 సెకండ్ల నుంచి 2 సెక్లనకు కుదించారు. దీంతో వాహనాలు ట్రాఫిక్ లేకుండా వెళ్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు