Swati Maliwal: మా నాన్న చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యా.. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్

శనివారం ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన విషయం వెల్లడించారు. ‘‘నా చిన్నప్పుడు మా నాన్నే నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంలో ఆయన నన్ను కొట్టేవాడు కూడా. దీంతో ఆయనకు భయపడి మంచం కింద దాక్కునే దాన్ని’’ అని స్వాతి చెప్పారు.

Swati Maliwal: కన్న తండ్రే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించారు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్. శనివారం ఆమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన విషయం వెల్లడించారు. ‘‘నా చిన్నప్పుడు మా నాన్నే నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Bandi Sanjay Comments: బండి సంజయ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఆగ్రహం.. పోలీస్ కేసు నమోదు

ఈ విషయంలో ఆయన నన్ను కొట్టేవాడు కూడా. దీంతో ఆయనకు భయపడి మంచం కింద దాక్కునే దాన్ని’’ అని స్వాతి చెప్పారు. చిన్నప్పుడు లైంగిక వేధింపుల విషయంలో తండ్రి వల్ల కఠిన పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆమె అన్నారు. దేశంలో పెరిగిపోతున్న లైంగిక వేధింపులపై ఆమె మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే సినీ నటి కుష్బూ కూడా ఇదే తరహా అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు చెప్పింది. తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఇటీవలే కుష్బూ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చెప్పినందుకు తానేమీ సిగ్గుపడటం లేదని కూడా ఆమె చెప్పింది.

Goa Forest Fire: గోవాలో దావానలం.. తగలబడుతున్న అడవులు.. ప్రధాని మోదీ సమీక్ష

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డాటా ప్రకారం.. దేశంలో 2021లో 31,667 అత్యాచారాలు జరిగాయి. అంటే సగటున రోజుకు 86 అత్యాచారాలు జరిగాయి. అలాగే మహిళలపై రకరకాలుగా గంటకు 49 నేరాలు, దాడులు జరుగుతున్నాయి. 2021కి సంబంధించి ఎన్‌సీఆర్‌బీ క్రైమ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం గతంతో పోలిస్తే అత్యాచారాలు పెరిగాయి. 2020లో 28,046 అత్యాచార ఘటనలు జరిగితే, 2019లో 32,033 అత్యాచారాలు జరిగాయి.

అత్యధికంగా రాజస్థాన్‌ (6,337)లో, ఆ తర్వాత మధ్య ప్రదేశ్ (2,947), మహారాష్ట్ర (2,496), ఉత్తర్ ప్రదేశ్ (2,845), ఢిల్లీ (1,250)లో అత్యాచార ఘటనలు జరిగాయి. చిన్నారులపై అత్యాచార, వేధింపుల ఘటనలు కూడా పెరిగాయి. అత్యాచార ఘటనల్లో నిందితులు ఎక్కువగా తెలిసిన వాళ్లే అయ్యుండటం గమనార్హం.

 

 

ట్రెండింగ్ వార్తలు