Bandi Sanjay Comments: బండి సంజయ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఆగ్రహం.. పోలీస్ కేసు నమోదు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపైనే కమిషన్ స్పందించింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Bandi Sanjay Comments: ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీని కమిషన్ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Cheruku Sudhakar : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా కొడుకును చంపుతానని బెదిరించారు : చెరుకు సుధాకర్

దీనిపైనే కమిషన్ స్పందించింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని కమిషన్ మండిపడింది. ఈ మేరకు ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనేక చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లలో బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.

Delhi Liquor Case: కవితను ప్రశ్నిస్తున్న ఈడీ.. ఆఫీసు దగ్గర టెన్షన్ టెన్షన్

దీంతో ఆయనపై 354, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కలవబోతున్నారు. గవర్నర్‌ను కలిసి బండి సంజయ్‌పై ఫిర్యాదు చేయబోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు