Severe Heatwave: వేడి నుంచి అతి వేడిగా మారనున్న వాతావరణం: వాతావరణశాఖ హెచ్చరిక

ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ పలు ప్రాంతాల్లో వేడి నుంచి అతి వేడిగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.

Severe Heatwave: దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వేడి వాతావరణం నెలకొందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ పలు ప్రాంతాల్లో వేడి నుంచి అతి వేడిగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. రాజస్థాన్ లోని పలు ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అతి వేడి(Heatwave) వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ తెలిపింది. రాజస్థాన్లోని బార్మర్ లో అత్యధికంగా 43.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, విదర్భ, గుజరాత్ లో ఆదివారం నుంచి వేడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఏప్రిల్ ౩-6 మధ్య దేశంలోని మారుమూల ప్రదేశాలలో తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also read:Bullet bike blast: అనంతపురం జిల్లాలో పేలిన బుల్లెట్ బైక్

సాధారణ ఉష్ణోగ్రత నుంచి 6.4 నాచెస్ కంటే ఎక్కువగా ఉంటే తీవ్రమైన హీట్ వేవ్ గా పరిగణిస్తారు. శనివారం దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 39.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయిందని, ఇది సీజన్ సాధారణం కంటే ఆరు డిగ్రీలు ఎక్కువగా ఉందని ఐఎండి తెలిపింది. మరోవైపు ఆదివారం పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. రాబోయే ఐదు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఏప్రిల్ 5 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ఏప్రిల్ 4 వరకు పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Also read:Piyush Goyal On Rice : ఒక స్థాయి వరకే సహకారం ఇవ్వగలం-పీయూష్ గోయల్

ట్రెండింగ్ వార్తలు