India Covid Update : దేశంలో కొత్తగా 1,61,386 కోవిడ్ కేసులు నమోదు

దేశంలో కరోనా తీవ్రత క్రమేపి తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,61,386 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

India Covid Update :  దేశంలో కరోనా తీవ్రత క్రమేపి తగ్గుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1,61,386 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో కోవిడ్ రోగుల సంఖ్య 4,16,30,885కి చేరింది. సోమవారం కంటే మంగళవారం సుమారు 6 వేల కేసులు తక్కువ నమోదయ్యాయి.

నిన్న కోవిడ్ తదితర కారణాలతో 1,733 మంది మరణించారు. దీంతో దేశంలోని కోవిడ్ మరణాల సంఖ్య 4,97,975కి   చేరింది. ప్రస్తుతం దేశంలో 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  దేశంలో పాజిటివిటీ రేటు 9.26 శాతానికి పడిపోగా, వారం వారీ పాజిటివిటీ రేటు కూడా 14.15 శాతానికి పడిపోయింది.

నిన్న 2,81,109  మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో   కోలుకున్న వారి సంఖ్య 3,95,11,307కి చేరింది. దేశంలో రికవరీ రేటు 94.91 శాతంగా ఉంది.  దేశంలో నిన్న 17,42,793 కరోనా పరీక్షలునిర్వహించారు. ఇంతవరకు దేశంలో 73.24 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read : Statue Of Equality : “సమతా స్ఫూర్తి” ఆధ్యాత్మిక గీతం.. శ్రీమాన్ త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆవిష్కరణ
దేశంలో కోవిడ్ నివారణకు  చేపట్టిన  వ్యాక్సిన్ డ్రైవ్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు 167.29 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటికే దేశంలో అర్హులైన 75 శాతం మందికి రెండు డోసులు కరోనా ఇచ్చారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు