India Tour of Ireland : ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. బుమ్రా వ‌చ్చేశాడు.. కెప్టెన్సీ కూడా అత‌డికే

టీమ్ఇండియా అభిమానుల‌కు శుభవార్త ఇది. పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా వ‌చ్చేశాడు. గ‌త కొంత‌కాలంగా వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్న బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక అయ్యాడు.

Bumrah

India Tour of Ireland 2023 : టీమ్ఇండియా అభిమానుల‌కు శుభవార్త ఇది. పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా (Bumrah) వ‌చ్చేశాడు. గ‌త కొంత‌కాలంగా వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్న బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డంతో ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక అయ్యాడు. అంతేనా అత‌డి సార‌థ్యంలోనే టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. దీంతో అత‌డు స్వ‌దేశంలో జ‌రిగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడ‌తాడా లేదా అనే సందేహాల‌కు తెర‌ప‌డింది.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంట‌నే భార‌త జ‌ట్టు ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా ఐర్లాండ్‌తో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 15 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న త‌రువాత వెంట‌నే భార‌త్ ఆసియా క‌ప్ ఆడాల్సి ఉన్న నేప‌థ్యంలో ఆ టోర్నీలో పాల్గొనే ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌లేదు.

LPL 2023 : లంక ప్రీమియ‌ర్ లీగ్‌లో అనుకోని అతిథి.. బంగ్లాదేశ్ నుంచి వ‌చ్చింద‌న్న దినేశ్ కార్తీక్

ఈ ప‌ర్య‌ట‌న‌కు ద్వితియ శ్రేణి జ‌ట్టును ఎంపిక చేసింది. ఆసియా క్రీడ‌ల్లో పాల్గొనే జ‌ట్టునే ఎంపిక చేశారు. బుమ్రా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు.

ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఇదే..

జ‌స్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, వాషింగ్ట‌న్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్

Rohit Beats Chahal : చాహల్‌ను కొట్టిన రోహిత్‌.. ప‌క్క‌నే ఉన్న కోహ్లి ఏం చేశాడంటే..?

ట్రెండింగ్ వార్తలు