World Cup 2023 : వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్‌లో మార్పులు.. భారత్ vs పాక్ మ్యాచ్‌ స‌హా 9 మ్యాచుల రీ షెడ్యూల్‌.. టికెట్లు విక్ర‌యించే తేదీలు ఇవే..

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup 2023) జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో విజ‌యం సాధించేందుకు అన్ని జ‌ట్లు త‌మ అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి.

ICC World Cup 2023

ICC World Cup 2023 rescheduled : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup 2023) జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో విజ‌యం సాధించేందుకు అన్ని జ‌ట్లు త‌మ అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే మెగా టోర్నీని సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌గా.. తాజాగా ఈ షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) స‌వ‌రించిన కొత్త షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. భారత్ vs పాక్ మ్యాచ్ స‌హా మొత్తం 9 మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

Asia Cup 2023 Match Timings : ఆసియాక‌ప్‌లో మ్యాచులు ఎన్ని గంట‌ల‌కు మొద‌లవుతాయంటే..? పూర్తి షెడ్యూల్ ఇదే..

ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య అక్టోబ‌ర్ 15న మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. అక్టోబ‌ర్ 15 నుంచి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. నిఘా సంస్థ‌ల సూచ‌న‌ల మేర‌కు భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా అంటే అక్టోబ‌ర్ 14కి మార్చారు. వేదిక‌లో ఎలాంటి మార్పు లేదు.

రీ షెడ్యూల్ అయిన మ్యాచులు ఇవే..

– పాకిస్థాన్‌ vs శ్రీలంక అక్టోబర్ 10న
– ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ అక్టోబర్ 10న
– ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా అక్టోబర్ 12న
– ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ అక్టోబర్ 13న
– భారత్ vs పాకిస్తాన్ అక్టోబర్ 14న
– ఇంగ్లాండ్ vs అఫ్గానిస్థాన్ అక్టోబర్ 15న
– ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ నవంబర్‌ 11న
– ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ నవంబర్‌ 11న
– భారత్ vs నెదర్లాండ్స్ నవంబర్‌ 12న జ‌ర‌గ‌నున్నాయి.

Rescheduled matchs

ప్ర‌పంచ‌క‌ప్‌కు టికెట్లు ఈ తేదీల్లో విక్రయించబడతాయి:

ఆగస్ట్ 25 – నాన్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు
ఆగస్టు 30 – గౌహతి, త్రివేండ్రంలో జ‌రిగే భార‌త మ్యాచుల టికెట్లు
ఆగష్టు 31 – చెన్నై, ఢిల్లీ, పూణేలో జ‌రిగే భార‌త మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 1 – ధర్మశాల, లక్నో,ముంబైలో జ‌రిగే భార‌త మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 2 – బెంగళూరు, కోల్‌కతాలో జ‌రిగే భార‌త మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 3 – అహ్మ‌ద‌బాద్‌లో జ‌రిగే భార‌త మ్యాచ్ టికెట్లు
సెప్టెంబర్ 15- సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచుల టికెట్లు ల‌ను విక్ర‌యిస్తారు.

IND vs WI 3rd T20 : సూర్య‌కుమార్ విధ్వంసం.. బోణీ కొట్టిన భార‌త్‌.. మూడో టీ20లో విజ‌యం

World Cup rescheduled list

ట్రెండింగ్ వార్తలు