Jayaprada : ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని ఇప్పటికి కూడా పోరాడుతున్నాను..

ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. అలాగే కొన్ని కాంట్రవర్సీ విషయాలని కూడా మాట్లాడారు. షోలో నేషనల్ అవార్డుల గురించి కూడా మాట్లాడారు. జయసుధ, జయప్రదలకి ఎంతోకాలంగా ఉన్నా పద్మశ్రీ, పద్మ భూషణ్ లాంటివి రాలేదని అడిగారు. అయితే ఈ నేపథ్యంలో జయప్రద ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు అంశంపై..............

Jayaprada :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య ఎపిసోడ్ లో సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. అలాగే కొన్ని కాంట్రవర్సీ విషయాలని కూడా మాట్లాడారు. షోలో నేషనల్ అవార్డుల గురించి కూడా మాట్లాడారు. జయసుధ, జయప్రదలకి ఎంతోకాలంగా ఉన్నా పద్మశ్రీ, పద్మ భూషణ్ లాంటివి రాలేదని అడిగారు. అయితే ఈ నేపథ్యంలో జయప్రద ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు అంశంపై మాట్లాడింది.

Balakrishna : కంగనా రనౌత్ కి పద్మశ్రీ వచ్చింది నీకెందుకు రాలేదు?

జయప్రద ఒకసారి రాజ్యసభ, రెండుసార్లు లోక్ సభ ఎంపీగా పనిచేశారు. అయితే ఆ సమయంలో భారతరత్న అవార్డు ఎన్టీఆర్ కి ఇవ్వాలని ఎన్నోసార్లు అప్పటి ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేశాను. ఎంపీగా ఉన్నప్పుడు చాలా సార్లు సభలలో అడిగాను కూడా. ఇప్పటికి కూడా ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని పోరాడుతున్నాను, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అని తెలిపింది. ఎంతోకాలంగా ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనే అంశం ఉన్న సంగతి తెలిసిందే. మరోసారి జయప్రద వ్యాఖ్యలతో ఈ టాపిక్ చర్చలోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు