జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం..

రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తొలగింపు చర్యలు చేపట్టారు.

YSRCP Chief Jaganmohan Reddy : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. హైదరాబాద్ లోని జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. గతంలో జగన్ భద్రత కోసం లోటస్ పాండ్ జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి భద్రత సిబ్బందికోసం గదులను నిర్మించారు. ఆ నిర్మాణాలను శనివారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.

Also Read : ఐఏఎస్ అధికారి కృష్ణ తేజకు అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తొలగింపు చర్యలు చేపట్టారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు.

 

ట్రెండింగ్ వార్తలు