Balakrishna : కంగనా రనౌత్ కి పద్మశ్రీ వచ్చింది నీకెందుకు రాలేదు?

ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. అలాగే కొన్ని కాంట్రవర్సీ విషయాలని కూడా మాట్లాడారు. షోలో బాలయ్య ఇటీవల కొంతమందికి పద్మశ్రీలు, పద్మభూషణ్ లు తొందరగా వస్తున్నాయి. మీరు ఎప్పట్నుంచో ఉన్నారు కానీ................

Balakrishna :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్‌ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. అన్‌స్టాపబుల్‌ రెండో సీజన్ లో ఇప్పటికే అయిదు ఎపిసోడ్ లు పూర్తికాగా తాజాగా ఆరో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఆరో ఎపిసోడ్ కి ముగ్గురు భామలని తీసుకొచ్చారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ జయప్రద, జయసుధలతో పాటు ఇప్పటి హీరోయిన్ రాశిఖన్నాని తీసుకొచ్చారు. ఈ ముగ్గురితో కలిసి బాలయ్య ఎపిసోడ్ లో సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ లో జయసుధ, జయప్రదలతో అప్పటి సినిమాలు, నటుల గురించి మాట్లాడారు. అలాగే కొన్ని కాంట్రవర్సీ విషయాలని కూడా మాట్లాడారు. షోలో బాలయ్య ఇటీవల కొంతమందికి పద్మశ్రీలు, పద్మభూషణ్ లు తొందరగా వస్తున్నాయి. మీరు ఎప్పట్నుంచో ఉన్నారు కానీ గవర్నమెంట్ నుంచి మీకు సరైన గుర్తింపు రాలేదు. ఉదాహరణకి కంగనా రనౌత్ కి పద్మశ్రీ వచ్చింది నీకు ఎందుకు రాలేదు అని అడిగాడు.

Unstoppable : కృష్ణ-జయప్రద కాంబినేషన్ లో 48 సినిమాలు.. అన్‌స్టాపబుల్ లో కృష్ణ గారికి సంతాపం..

దీనికి జయసుధ సమాధానమిస్తూ.. కంగనా మంచి నటి, ఒప్పుకుంటాను, చాలా బాగా యాక్ట్ చేస్తుంది. కానీ చేసిన 10 సినిమాలకే పద్మశ్రీ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి. సాధారణంగా సౌత్ లో ఉన్న వారిని ఎక్కువగా గుర్తించరు. శారదా, విజయనిర్మల ఇలా చాలా మందిని గుర్తించలేదు అని తెలిపింది. దీనిపై జయప్రద మాట్లాడుతూ అవార్డులు అనేవి వాళ్లకి ఇవ్వాలి అనిపించి ఇవ్వాలి, మనం అడిగి తీసుకునేవి కాదు అని అంది.

ట్రెండింగ్ వార్తలు