Vijay – Pawan Kalyan : పవన్ లాగే విజయ్ కూడా సంచలన నిర్ణయం.. అప్పటివరకు ఏ ఎన్నికల్లో పోటీ చేయనంటూ..

తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా ఇటీవలే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.

Vijay – Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఈ విజయం కోసం పవన్ పదేళ్లకు పైగా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి మొదట పోటీ చేయకుండా వేరే పార్టీలకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఓడిపోయి, మళ్ళీ ఇప్పుడు కూటమితో కలిసి అధికారంలోకి వచ్చాడు పవన్.

తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా ఇటీవలే పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ లాగే విజయ్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ప్రజలకు సేవ చేయడానికి ముందు ఉంటాడు. గతంలో తన స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన విజయ్ ఇటీవలే తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించాడు. ఎప్పట్నుంచో విజయ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి. త్వరలో తమిళనాడులో ఓ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుందని కొన్ని రోజులుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Also Read : Prabhas Spirit : ‘స్పిరిట్’ సినిమా అప్డేట్.. ప్రభాస్‌తో సందీప్ వంగ షూటింగ్ ఎప్పట్నించి అంటే..?

తాజాగా విజయ్ తన పార్టీ ద్వారా అధికారికంగా దీనిపై స్పందిస్తూ ఓ లేఖను విడుదల చేసారు. తమిళ వెట్రి కజగం పార్టీ తరపున విడుదల చేసిన లేఖలో.. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ తమిళ వెట్రి కజగం పార్టీ పోటీ చేయదు. ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ చెయ్యట్లేదు. అలాగే ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వట్లేదు అని తెలిపారు.

దీంతో పవన్ కళ్యాణ్ లాగే మొదట్లో పార్టీ పోటీ చేయకుండా ఉండి ఆ తర్వాత పోటీ చేసేలా విజయ్ ప్లాన్ చేసుకున్నారని, ఈ లోపు గ్రౌండ్ లెవల్లో పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారని తమిళ మీడియా సమాచారం. ఇప్పుడు పవన్ సాధించిన విజయం విజయ్ కి కూడా ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చింది. మరి పవన్ లాగే విజయ్ కూడా రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాడా చూడాలి. ఇక సినిమా పరంగా విజయ్ ప్రస్తుతం The GOAT సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సినిమాలు ఆపేసి పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయిస్తాడని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు