Highest Paid Actress : అలియా కాదు.. కంగ‌నా కాదు.. బాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న న‌టి ఎవ‌రంటే..?

2024లో బాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం పొందిన న‌టిగా దీపికా పదుకోన్ నిలిచింది.

2024లో బాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం పొందిన న‌టిగా దీపికా పదుకోన్ నిలిచింది. ఫోర్బ్స్, IMDb క్యూరేట్ చేసిన జాబితాలో తన సమకాలీనులైన.. అలియా భట్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్ వంటి వారిని అధిగమించి దీపికా అగ్రస్థానంలో నిలిచింది. నివేదిక ప్రకారం.. దీపిక ఒక్కొ సినిమాకు రూ.15 నుండి 30 కోట్లు వసూలు రెమ్యూన‌రేష‌న్ గా తీసుకుంటుంది. ఇక రెండో స్థానంలో కంగ‌నా ర‌నౌత్ ఉంది. కంగ‌నా ఒక్కొ మూవీకి రూ.15-27 కోట్లు వసూలు చేస్తుంది.

వీరిద్ద‌రి త‌రువాతి స్థానంలో ప్రియాంక చోప్రా ఉంది. ప్రియాంక ఒక్కొ చిత్రానికి రూ.15-25 కోట్లు వసూలు చేస్తుందని జాబితా వివరించింది. ఆ త‌రువాత కత్రినా కైఫ్, అలియా భట్ లు వ‌రుస‌గా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. క‌త్రినా ఒక్కొ చిత్రానికి రూ. 15-25 కోట్లు, అలియా భ‌ట్‌ రూ.10-20 కోట్లు రెమ్యూన‌రేష‌న్‌గా తీసుకుంటున్నారు.

Kalki 2898 AD : ‘కల్కి’ సినిమా కథేంటి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం చెప్పారంటే..?

ఆ త‌రువాతి స్థానాల్లో కపూర్ ఖాన్ (రూ8-18 కోట్లు), శ్రద్ధా కపూర్ (రూ.7-15 కోట్లు), విద్యాబాలన్ (రూ 8-14 కోట్లు), అనుష్క శర్మ (రూ 8-12 కోట్లు), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (రూ 10 కోట్లు) ఉన్నారు. కాగా.. సౌత్ కు చెందిన హీరోయిన్ల‌లో ఒక్క‌రు కూడా టాప్‌-10లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక దీపిక విష‌యానికి వ‌స్తే.. ఆమె ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి. త‌న మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తోంది. ప్ర‌భాస్ హీరోగా దీపిక న‌టించిన ‘క‌ల్కి 2898 AD’ జూన్ 27 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించ‌గా తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, ఇంగ్లీష్ బాష‌ల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

NTR Devara : ఎన్టీఆర్ ‘దేవర’ పక్కా హిట్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటున్న ఫ్యాన్స్.. 23 ఏళ్ళ తర్వాత..

ట్రెండింగ్ వార్తలు