Trivikram Sons : త్రివిక్రమ్ ఇద్దరు కొడుకులను చూశారా..? తిరుమలలో భార్యాపిల్లలతో త్రివిక్రమ్..

తాజాగా నేడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లారు.

Trivikram Sons : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల సంక్రాంతికి మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు. తాజాగా నేడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లారు.

Also Read : Trivikram : పవన్ గెలుపు.. తిరుమలకు కాలి నడకన త్రివిక్రమ్.. త్రివిక్రమ్ తనయుడిని చూశారా?

తన భార్య సౌజన్య, ఇద్దరు కొడుకులు రిషి, నీరజ్ లతో కలిసి త్రివిక్రమ్ నిన్న సాయంత్రం శ్రీవారి మెట్టు నుంచి తిరుమలకు నడిచి వెళ్ళాడు. నిన్న సాయంత్రం తిరుమలకు త్రివిక్రమ్ ఫ్యామిలీతో కలిసి నడిచి వెళ్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. నేడు ఉదయం త్రివిక్రమ్ తన కుటుంబంతో కలిసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియా త్రివిక్రమ్ ని పలకరించింది. అయితే త్రివిక్రమ్ ని మాట్లాడమని అడగ్గా ఏమి మాట్లాడకుండానే వెళ్లిపోయారు. దీంతో త్రివిక్రమ్ కొడుకులు ఇద్దరూ మొదటిసారి కలిసి కనపడటంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు