Schemes Names Changed : ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లు మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పథకాల పేర్లని మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ హయాంలో పలు స్కీమ్ లు తీసుకొచ్చారు. వాటిని జగన్, వైఎస్ఆర్ పేర్లతో అమలు చేశారు. తాజాగా ప్రభుత్వం మారిపోవడంతో ఆయా సంక్షేమ పథకాల పేర్లు మార్చేశారు సీఎం చంద్రబాబు.
జగన్ పథకాల పేర్లు మార్చేసిన చంద్రబాబు..
* జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన – పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ గా పేరు మార్పు.
* జగనన్న విదేశీ విద్యాదీవెన – అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్పు.
* వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్దరణ.
* వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు.
* జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకానికి.. సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహకంగా పేరు మార్పు.
Also Read : ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్