డిప్యూటీ సీఎంగా తొలిసారి సచివాలయానికి పవన్ కల్యాణ్, వెల్‌కమ్ చెప్పిన సీఎం చంద్రబాబు

రాజధాని రైతులు పవన్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అడుగడుగునా పూలతో వెల్ కమ్ చెప్పారు అభిమానుల. పవన్ పై పూల వర్షం కురిపించి తన అభిమానం చాటుకున్నారు.

Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా తొలిసారి పవన్ కల్యాణ్ ఏపీ సచివాలయానికి వెళ్లారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు పవన్. ఉప ముఖ్యమంత్రి పవన్ కు సాదరంగా ఆహ్వానం పలికారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు.

పవన్ పాటు సీఎం చంద్రబాబును మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కలిశారు. అంతకుముందు రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ లో పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. రాజధాని రైతులు పవన్ కు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అడుగడుగునా పూలతో వెల్ కమ్ చెప్పారు అభిమానుల. పవన్ పై పూల వర్షం కురిపించి తన అభిమానం చాటుకున్నారు.

డిప్యూటీ సీఎం హోదాలో రేపు పవన్ కల్యాణ్ సచివాలయంలోని తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా పవన్ కల్యాణ్ సచివాలయం చేరుకున్నారు. దారి పొడవునా పవన్ కు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. రాజధాని రైతుల, అభిమానులు పవన్ కు ఘనంగా స్వాగతం పలికారు. సచివాలయ సిబ్బంది సైతం పవన్ కు వెల్ కమ్ చెప్పారు. సచివాలయం బ్లాక్ 1 లో పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. బ్లాక్ 2లో తన చాంబర్ ను పవన్ కల్యాణ్ పరిశీలించనున్నారు. పవన్ కల్యాణ్ తన బ్లాక్ లో మార్పులు చేర్పులు చేయనున్నారని సమాచారం.

Also Read : ఎవర్నీ వదలం.. ఆరోగ్యశ్రీ పథకంపై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు