Prabhas Spirit : ‘స్పిరిట్’ సినిమా అప్డేట్.. ప్రభాస్‌తో సందీప్ వంగ షూటింగ్ ఎప్పట్నించి అంటే..?

సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోయే స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Prabhas Spirit : ప్రభాస్ త్వరలో కల్కి సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ప్రభాస్ చేతిలో భారీ సినిమాలు ఉన్నాయి. సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా, రాజా సాబ్ సినిమాలు ఉన్నాయి. అయితే కల్కి తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రాబోయే స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు జూన్ 27న రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత రాజా సాబ్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆల్రెడీ రాజా సాబ్ షూటింగ్ 30 శాతం అయింది. రాజా సాబ్ సినిమా షూటింగ్ అయ్యాక ఈ సంవత్సరం చివర్లో డిసెంబర్ నుంచి ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Trivikram Sons : త్రివిక్రమ్ ఇద్దరు కొడుకులను చూశారా..? తిరుమలలో భార్యాపిల్లలతో త్రివిక్రమ్..

ప్రస్తుతం సందీప్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయిందని సమాచారం. లొకేషన్స్, ఆర్టిస్టులు చూసుకొని డిసెంబర్ నుంచి స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది. దీంతో ప్రభాస్ అభిమానులు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని పోలీసాఫీసర్ గా చూడటానికి ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు