Karnataka BJP chief: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక బీజేపీ చీఫ్

ఇక బీజేపీ కార్యకర్తలకు ఆయన చేసిన ఒక సూచన కూడా చాలా వివాదాస్పదమవుతోంది. రోడ్డు, మురుగునీటి సమస్యలపై దృష్టి పెట్టకుండా లవ్ జిహాద్‌ వై్ దృష్టి పెట్టాలంటూ కాషాయ పార్టీ కార్యకర్తలను నళిన్ కోరారు. తాము టిప్పుసుల్తాన్ వారసులు కాదని.. రాముడు, హనుమంతుడి భక్తులమని, టిప్పుసుల్తాన్ వారసులను ఇంటికి పంపిస్తామని బీజేపీ చీఫ్ చెప్పారు

Karnataka BJP chief: వివాదాస్పద వ్యాఖ్యలకు మారు పేరైన కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. టిప్పుసుల్తాన్‌ను ప్రేమించే వారు కర్ణాటక రాష్ట్రంలో ఉండవద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారాయి. ఇంతటితో ఆగకుండా రాష్ట్రం రాముడు, హనుమాన్ ఆరాధకులకు మాత్రమేనని అంటూ కటీల్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ ఏడాది చివర్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వీటిని టార్గెట్ గానే కటిల్ ఈ వ్యాఖ్యలు చేశారని విపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

Revanth Reddy : ఇళ్లు లేని వారికి రూ.5లక్షలు, రుణమాఫీ రూ.2లక్షలు, రూ.500లకే గ్యాస్ బండ-రేవంత్ రెడ్డి హామీ

మంగళవారం రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో కటిల్ మాట్లాడుతూ ‘‘రాముడు, హనుమాన్‌లకు ఓటు వేయడం ద్వారా టిప్పు సుల్తాన్ వారసులను తరిమికొట్టండి. నేను హనుమంతుని భూమిపై సవాలు చేస్తున్నాను. టిప్పుసుల్తాన్‭ను ప్రేమించే వ్యక్తులు ఇక్కడ ఉండకూడదు. రామభజన చేసేవారు, హనుమంతుడిని ప్రార్థించే వారు మాత్రమే ఇక్కడే ఉండాలి’’ అని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఆయన టిప్పుసుల్తాన్ వర్సెస్ సావర్కర్‌ల మధ్య పోరు అని కటిల్ పోల్చారు. గత కొంత కాలంగా సావర్కర్, టిప్పు సుల్తాన్ అంశాలు రాజకీయంగా తీవ్రమైన చర్చలో ఉన్నాయి. దాన్ని మరింత చర్చనీయాంశం చేసే విధంగా ఆయన వ్యాఖ్యానించారు.

Viral Video: బడి వద్ద మైదానంలో అద్భుత రీతిలో సిక్సర్లు కొట్టిన బాలిక.. సచిన్, జైషా ప్రశంసలు

ఇక బీజేపీ కార్యకర్తలకు ఆయన చేసిన ఒక సూచన కూడా చాలా వివాదాస్పదమవుతోంది. రోడ్డు, మురుగునీటి సమస్యలపై దృష్టి పెట్టకుండా లవ్ జిహాద్‌ వై్ దృష్టి పెట్టాలంటూ కాషాయ పార్టీ కార్యకర్తలను నళిన్ కోరారు. తాము టిప్పుసుల్తాన్ వారసులు కాదని.. రాముడు, హనుమంతుడి భక్తులమని, టిప్పుసుల్తాన్ వారసులను ఇంటికి పంపిస్తామని బీజేపీ చీఫ్ చెప్పారు. నారాయణ్‌ టిప్పు సుల్తాన్‭ను సిద్ధరామయ్యతో కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వత్‌ పోల్చారు. టిప్పు సిద్ధరామయ్య ఉరిగౌడ, నంజెగౌడ చేతిలో టిప్పుసుల్తాన్‭లా ఓడిపోతాడని నారాయణ్ వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు