Sammathame: వినూత్న కథలను ఎంచుకుంటూ తన నటన, అభినయంతో సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. చేసింది నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకులలో మంచి స్థానం సంపాదించుకున్న కిరణ్.. ఇటీవలే సెబాస్టీయన్ వంటి వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం సమ్మతమే. గోపినాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయన్‌గా నటించింది.
Sammathame : ఈ వలపు మలుపుల్లో సతమతము ‘సమ్మతమే’..
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు. గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 24న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఐ లవ్యూ కృష్ణ అంటూ ఓ అమ్మాయి ప్రపోజల్‌తో టీజర్ మొదలవుతుంది. అయితే.. పెళ్లికి ముందు ప్రేమ పడదండీ, అందులో నేను పడను అంటూ తన గురించి చెప్పకనే చెప్పాడు హీరో.
Kiran Abbavaram: కొత్త హీరో.. వరసగా ఐదు సినిమాల హీరో!
అయితే తనకు తెలీకుండానే హీరోయిన్‌తో ఎలా లవ్‌లో పడ్డాడు? అసలది ప్రేమే అని ఎలా తెలుసుకున్నాడు? అన్నది తెలియజేస్తూ కొన్ని సీన్లు వదిలారు. ఇక ఈ మూవీలో కిరణ్ బాలయ్య అభిమానిగా చూపించారు. టీజర్ నిండా లవ్ సీన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇందులో కిరణ్, చాందిని చౌదరి మధ్య కెమిస్ట్రీ అదిరింది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ చిత్రంతో కిరణ్ మరో హిట్ కొడతాడో లేదో వేచిచూడాలి.