Krithi Shetty reaction post on fake news circulating in social media
Krithi Shetty : టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ఆడియన్స్ దగ్గర మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ఆ మూవీతో స్టార్ హీరో సినిమాల్లో వరుస ఆఫర్లు అందుకుంది. నాని, నాగచైతన్య, రామ్ పోతినేని సినిమాల్లో నటించి అలరించింది. అయితే ఈ భామ ని ఒక స్టార్ హీరో కొడుకు గత కొంత కాలంగా వేధిస్తున్నాడని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కృతి ఎక్కడికి వెళ్లిన ఆ స్టార్ కిడ్ ఆమెను ఇబ్బందికి గురి చేస్తున్నాడని, ఈ విషయాన్ని స్వయంగా కృతినే తెలియజేసినట్లు వార్తలు రాసుకొస్తున్నారు.
ఇక ఈ వార్తలు శృతిమించడంతో కృతి శెట్టి తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతూ ఒక పోస్ట్ వేసింది. “ఇలాంటి తప్పుడు వార్తలను నేను నమ్మను. కానీ ఈ రూమర్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటిని అసలు నమ్మకండి” అంటూ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ వేసింది. ఈ పోస్ట్ తో అవన్నీ తప్పుడు వార్తలని తేలిపోయింది. కాగా ఇప్పటి వరకు తెలుగులోనే సినిమాలు చేస్తూ వచ్చిన కృతి శెట్టి.. ఇప్పుడు పక్క ఇండస్ట్రీ వైపు కూడా అడుగులు వేస్తుంది.
Krithi Shetty reaction post on fake news circulating in social media
Bholaa Shankar : భోళా శంకర్ అప్డేట్ ఇస్తూ.. సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిరు..
ఆల్రెడీ బై లింగువల్ సినిమాలతో తమిళ్ ఆడియన్స్ కి పరిచయం అయిన ఈ భామ.. ఇప్పుడు స్ట్రెయిట్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి చేయబోతున్న ‘జీని’ (Genie) అనే సినిమాలో కృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. అలాగే మలయాళ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతోంది. టోవినో థామస్ హీరోగా తెరకెక్కుతున్న ‘అజాయంతే ర్యాండమ్ మోక్షణం’ (Ajayante Randam Moshanam) సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.