Lata Mangeshkar : రాజకీయాల్లో లతా మంగేష్కర్..

లతా మంగేష్కర్ రాజకీయాల్లో కూడా ఉన్నారని చాలా తక్కువ మందికి తెలుసు. ఆమెకు రాజకీయాల మీద అంత ఆసక్తి లేదు. కానీ 1999లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్‌ అయ్యారు. అప్పుడు.........

Lata Mangeshkar :  భారతదేశ గొప్ప సింగర్, గాన కోకిల లతా మంగేష్కర్‌ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానుల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె మరణం భారత సినీ సంగీత పరిశ్రమకి తీరని లోటు. ఆమె మరణంతో అందరూ ఆమె లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.

లతా మంగేష్కర్ రాజకీయాల్లో కూడా ఉన్నారని చాలా తక్కువ మందికి తెలుసు. ఆమెకు రాజకీయాల మీద అంత ఆసక్తి లేదు. కానీ 1999లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్‌ అయ్యారు. అప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో అటల్ బిహారి వాజ్ పేయ్ సారథ్యన బిజెపి ప్రభుత్వం ఉంది. 1999 నవంబర్ 22 నుండి 2005 నవంబర్ 21 వరకు ఆమె రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

Lata Mangeshkar : స్కూలుకే వెళ్లని లతా మంగేష్కర్.. ఎన్ని భాషలు వచ్చో తెలుసా?

అయితే రాజ్యసభ ఎంపీగా ఉన్నంతకాలం ఆమె ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా ఆదర్శంగా నిలిచారు. ఆమెకు రాజకీయాల మీద ఆసక్తి లేకపోవడంతో రాజ్యసభ సమావేశాలలో పాల్గొనలేదు. చాలా తక్కువ సార్లు ఆమె సభకు వెళ్లారు. అప్పటి ప్రభుత్వాలు ఆమెను కోరడంతో కాదనలేక రాజ్యసభ ఎంపీగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఆమె రాజకీయాల్లో లేరు, వాటి గురించి మాట్లాడలేదు కూడా. కానీ దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులంతా ఆమెకు సుపరిచితులే. అందరూ ఆమె పాటలు వినే వాళ్ళే. ఇందిరాగాంధీతో సహా ఎంతో మంది రాజకీయ నాయకులు ఆమెని కలవడానికి ఆసక్తి చూపించారు.

ట్రెండింగ్ వార్తలు