MS Dhoni : చెన్నైలోనే ఫస్ట్ టెస్ట్ ఆడాను.. ఇప్పుడు నిర్మాతగా నా మొదటి సినిమా.. ధోని!

ధోని నిర్మిస్తున్న LGM ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న జులై 10న చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఇక ఆ కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ..

M S Dhoni speech at Harish Kalyan Ivana LGM trailer launch event

Dhoni – LGM : ఇండియన్ మాజీ కెప్టెన్ ధోని.. ఇప్పుడు క్రీడా రంగం నుంచి ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ స్థాపించి సౌత్ లో పలు సినిమాలు నిర్మించబోతున్నాడు. ఇక తన ప్రొడక్షన్ హౌస్ లో మొదటి సినిమాని తమిళ పరిశ్రమలో తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan), లవ్ టుడే ఫేమ్ ఇవానా (Ivana) హీరోహీరోయిన్లుగా LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే క్యాచీ టైటిల్ తో ఒక సినిమా నిర్మించాడు.

Kashmira Shah : 14 సార్లు ప్రయత్నించినా తల్లిని కాలేకపోయా.. కానీ సల్మాన్ ఇచ్చిన సలహా వల్ల..

ఈ మూవీ ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న జులై 10న చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కోసం ధోని కుటుంబంతో సహా చెన్నై చేరుకోగా అభిమానులు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. ఇక ఆ కార్యక్రమంలో ధోని మాట్లాడుతూ.. “నా మొదటి టెస్ట్ చెన్నైలోనే ఆడాను. టెస్టుల్లో నా హైయెస్ట్ స్కోర్ కూడా చెన్నైలోనే నమోదు చేశాను. ఇప్పుడు నేను నిర్మిస్తున్న సినిమా కూడా తమిళ్ (చెన్నై) ది కావడం నాకు ఎంతో స్పెషల్. నేను ఎప్పుడో ఇక్కడి (తమిళ్) వాడిని అయ్యిపోయాను” అంటూ చెప్పుకొచ్చాడు.

OMG 2 Teaser : సూపర్ హిట్ సీక్వెల్ టీజర్ వచ్చేసింది.. ఈసారి నాస్తికుడు కోసం కాదు.. భక్తుడు కోసం!

ఇక LGM విషయానికి వస్తే.. లవ్ అండ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా మూవీ తెరకెక్కింది. అత్తతో కలిసి ఒకే ఇంటిలో ఉండాలి అంటే పెళ్లికి ముందు ఆమెను అర్ధం చేసుకోవాలని కోడలు (హీరోయిన్) కండిషన్ పెడుతుంది. దీంతో హీరో.. పెళ్ళికి ముందు ఒక వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఇక ఆ టూర్ లో ఎలాంటి సమస్యలు ఎదురుకున్నారు, చివరిగా అత్తని కోడలు అర్ధం చేసుకుందా అనేది మిగిలిన కథ. హీరో తల్లిగా హీరోయిన్ కి అత్త క్యారెక్టర్ లో నదియా నటిస్తుంది. రమేష్ తమిళమణి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.

 

ట్రెండింగ్ వార్తలు