×
Ad

Game Changer Song : ‘గేమ్ ఛేంజర్’లో ఫోక్ సాంగ్.. ఫ్లాష్ బ్యాక్‌లో.. లిరిక్ రైటర్ కామెంట్స్..

తాజాగా లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాలోని ఓ సాంగ్ గురించి మాట్లాడాడు.

  • Published On : July 27, 2024 / 09:05 AM IST

Lyric Writer Kasarla Shyam Interesting Comments on Game Changer Movie Folk Song

Game Changer Song : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 విడుదల అవుతుందని ఇటీవల నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి.. జరగండి..’ అనే ఒక్క పాట మాత్రమే విడుదల అయింది.

ఇటీవల ఓ ఈవెంట్లో తమన్.. ఈ సినిమాలో ఏడు పాటలు ఉంటాయని, రెండో సాంగ్ ఆగస్టు చివర్లో రిలీజ్ అవుతుందని తెలిపారు. తాజాగా లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ ఓ ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ సినిమాలోని ఓ సాంగ్ గురించి మాట్లాడాడు. లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమాకు ఒక పాట రాసాను. చాలా బాగుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్, అంజలి గారి మీద వస్తుంది ఆ పాట. నెల్లూరి నెరజాణ లాగా ఒక మంచి ఫోక్ సాంగ్ అవుతుంది అది. ఆ పాట కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఇటీవల భారతీయుడు 2 ప్రమోషన్స్ లో శంకర్ గారిని కలిసినప్పుడు నా పాట బాగా వచ్చిందని చెప్పినట్టు తెలిపారు.

Also Read : Chiranjeevi : మెగాస్టార్ ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో తెలుసా? ఇప్పుడు ఇద్దరూ హీరోలే..

కాసర్ల శ్యామ్ చేసిన కామెంట్స్ ని తమన్ షేర్ చేస్తూ.. ఈ సాంగ్ చాలా బాగుంటుందని తెలిపాడు. దీంతో కాసర్ల శ్యామ్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా చరణ్ ఫోక్ సాంగ్ ఫస్ట్ టైం చేస్తున్నాడని, ఈ పాట హిట్ అయి, ఇందులో అదిరిపోయే స్టెప్స్ ఉంటే ఫుల్ హ్యాపీ అని చరణ్ అభిమానులు ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.