Chiranjeevi : మెగాస్టార్ ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో తెలుసా? ఇప్పుడు ఇద్దరూ హీరోలే..
చిరంజీవి ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో అనుకుంటున్నారా?

Do you know who these two children Picked up by Megasta Chiranjeevi
Chiranjeevi : అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అవుతాయని తెలిసిందే. ఈ ఫోటో గతంలో బయటకి వచ్చినా ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ వల్ల మళ్ళీ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఉన్నాడు. ఏదో ఈవెంట్లో ఈ ఇద్దరు బాబులను ఎత్తుకున్నాడు మెగాస్టార్ అని తెలుస్తుంది. ఇందులో ఒక బాబు ఇంకో బాబుని బుగ్గ గిల్లుతున్నాడు. చూడటానికి క్యూట్ గా ఉన్న ఈ ఫోటోలో ఉన్న పిల్లలు ఇద్దరూ ఇప్పుడు హీరోలు. అందులో ఒకరు పాన్ ఇండియా హీరో కూడా.
Also Read : Thangalaan Release: ఆగస్టు 15న తంగలాన్ మాత్రమే రిలీజ్? ఇతర సినిమాల విడుదలకు బ్రేక్?
ఇంతకీ చిరంజీవి ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో అనుకుంటున్నారా? ఒకరు రామ్ చరణ్, ఇంకొకరు అల్లు శిరీష్. అల్లు శిరీష్ పుట్టిన రోజు ఈవెంట్లో చిరంజీవి వీళ్ళిద్దర్నీ ఎత్తుకుంటే ఇలా శిరీష్ సరదాగా రామ్ చరణ్ బుగ్గ గిల్లాడు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో ఈ ఫోటో మరో సారి వైరల్ అవుతుంది. గతంలో కూడా శిరీష్ నా ఫేవరేట్ కజిన్ రామ్ చరణ్ అని పలుమార్లు తెలిపాడు.
ఇక అల్లు శిరీష్ ఆగస్టు 2న బడ్డీ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తి పెంచగా ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.